బాబు మిగిల్చింది 100 కోట్లే... ఏపీలో పచ్చ మాఫియా ఏడుపు.... విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు...?
వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఈరోజు ఉదయం నుంచి చంద్రబాబును, ఆయన అనుకూల మీడియాను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. 2019లో చంద్రబాబు అధికారం కోల్పోయే నాటికి రాష్ట్ర ఖజానాలో 100 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. ఏపీలో కరోనా వల్ల లాక్ డౌన్ అమల్లో ఉండటంతో రాష్ట్రానికి రాబడి పూర్తిగా తగ్గిందని అన్నారు.
రాష్ట్రంలో మరో రెండు మూడు నెలలు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్ లో రాష్ట్ర ప్రజలు ఎవరూ ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సీఎం జగన్ అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్టు ప్రకటించారు. సీఎం జగన్ రాష్ట్రానికి ఆదాయం తగ్గుతున్నా ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తున్నారని చెప్పారు. సీఎం జగన్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇంత చేస్తున్నా పచ్చ మాఫియా మాత్రం ఏడుస్తూనే ఉందని కామెంట్లు చేశారు.
అందరు సీఎంలు కరోనాను ఎదుర్కోవడానికి పోరాడుతుంటే సీఎం జగన్ కరోనాతో పాటు ఎల్లో వైరస్ తో పోరాడుతున్నాడని అన్నారు.
బాబు పీడ రాష్ట్రానికి విరగడయ్యే నాటికి ఖజానాలో 100 కోట్లే మిగిలాయి. కరోనా వల్ల రాబడి పూర్తిగా తగ్గింది. వచ్చే 2-3 నెలలు ఇలాగే ఉండొచ్చు. లాక్ డౌన్ లో ఎవరూ ఇబ్బంది పడకూడదని సిఎం జగన్ గారు అనేక చర్యలు తీసుకున్నారు. హామీలు నెరవేస్తున్నారు. అయినా పచ్చ మాఫియా ఏడుస్తూనే ఉంది. — Vijayasai reddy v (@VSReddy_MP) April 27, 2020