మెరుగైన అందానికి పువ్వులతో ఫేస్ ప్యాక్..!!!

NCR

పువ్వులతో ఫేస్ ప్యాక్ గురించి ఎప్పుడైనా విన్నారా..?? సహజంగా పువ్వులని అలంకరణకి గాని, లేక పూజకి కానీ ఉపయోగిస్తారు. చాలా మందికి తెలిసి జుట్టు సంరక్షణలో ఉపయోగిస్తారు. కానీ అందం రెట్టింపు చేయడానికి, లేదా చర్మం కాంతివంతంగా మెరవడానికి , కొన్ని బహుముఖ ప్రయోజనాల కోసం పువ్వులని ఉపయోగిస్తారు అనేది చాలా మందికి తెలియదు. అయితే

 

కొంతమందికి తెలిసినా ఏ పువ్వు ఎలా వాడాలో చాలా మందికి తెలియదు. ఒకవేళ పువ్వులే కదా అని వాడితే చర్మంపై ఎక్కడ ఎలాంటి మచ్చలు వస్తాయో, లేదా చర్మం పాడవుతుందో అనే అనుమానంతో వెనకడుగు వేస్తారు. అందుకే సాద్యమైనంత వరకూ నిపుణుల సలహాలు, లేదా ఇంట్లో బామ్మల సలహాలు తీసుకుని అవి పాటించినా సరిపోతుంద్. సరే మరి ఇప్పుడు గులాబీ పువ్వులని ఉపయోగించి  మీ చర్మాన్ని మరింత అందంగా రెట్టింపు చేసేలా ఎలా ఉపయోగపడుతాయో ఇప్పుడు చూద్దాం..

 

ముందుగా గులాబీ రేకులు తీసుకుని (సుమారు ఒక కప్పుడు తీసుకోవాలి) వాటిని శుభ్రమైన నీటిలో మరిగించాలి. ఆ తరువాత వాటిని వడకట్టి మెత్తగా గుజ్జులా రుబ్బుకోవాలి. ఆ తరువాత కొంచం మంచి గంధం ఒక చెంచాడు తీసుకుని, ఆవు పాలు కూడా ఒక చెంచాడు తీసుకుని ఆ మిశ్రమంలో బాగా కలిపి దాన్ని ముఖానికి పట్టించుకోవాలి. ఆ తరువాత ముఖాని చల్లని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వలన ముఖం లేలేతగా కనిపించడమే కాకుండా ఎంతో సహజంగా సున్నితంగా కనిపిస్తుంది. ఇలా నెల రోజుల్లో వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే మీ అందం మరింత రెట్టింపు అవుతుందనడంలో సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: