మొటిమల నివారణకు ఇంటి చిట్కాలు...

Durga
- పాలతో టమాటో జ్యూస్ కలిపి రాస్తే పింపుల్స్ పోతాయి. తులసి ఆకులను వాటర్తో పేస్ట్ చేసి, ముఖానికి అప్లై చేసి ఇరవైని నిమిషాల తరవాత కడిగేవేయాలి. - రోజ్ వాటర్ లో చందనం పొడి కలిపి పేస్టులా చేసి ముఖానికి రాస్తే మొటిమలు తగ్గుతాయి. - మంచి గంధాన్ని అరగదీసి రోజూ రెండు మూడు సార్లు ముఖానికి రాసుకుంటే మొటిమలు పోతాయి. - గుప్పెడు వేపాకుల్లో నీళ్లు చిలకరించి పేస్ట్ చేసి, కొద్దిగా పసుపు కలిపి ముఖానికి అప్లై చేసి, 15-20 నిమిషాల తరవాత కడిగేయాలి. - పుదీనా ఆకులను మెత్తగా సూరి ప్రతిరోజు నైట్ ముఖానికి రాసి ప్రొద్దుట గోరువెచ్చని నీటితో కడగడం వలన మొటిమలు, మచ్చలు మాయమవుతాయి.  - చందనం, కర్పూరం పొడి నీటిలో కలిపి పేస్టులా చేసి రాత్రి పూట రాసుకుని ఉదయమే కడుక్కుంటూ ఉండాలి. ఇలా తరచు చేస్తూ ఉంటే మొటిమలు తగ్గుముఖం పడాతాయి. - మొటిమలు వల్ల ముఖంపై పడ్డ మచ్చలు తగ్గాలంటే బాగా పండిన టొమాటోను ముక్కలుగా కోసి వాటిలో టీ స్పూను నిమ్మరసం, టీ స్పూను ఓట్ మీల్ పౌడర్ లేదా అలోవెరా ఆకు జిగురును కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై మచ్చలున్న చోట అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కాటన్ తీసుకుని గోరువెచ్చని నీటిలో ముంచి ముఖాన్ని నెమ్మదిగా రబ్ చేస్తూ తుడవాలి. ఇలా క్రమం తప్పకుండా రెండు వారాలపాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. -  టీ స్పూన్ తేనెలో అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి కలిపి రిఫ్రిజరేటర్‌లో నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకోబోయే ముందు మొటిమల మీద అప్లై చేసి ఉదయా న్నే కడిగేయాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: