Paytm: వామ్మో.. బ్యాంకులకే దిమ్మతిరిగే షాక్?

Purushottham Vinay
Paytm గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డిజిటల్‌ చెల్లింపులు చేస్తున్న వారిలో ఈ పేరు తెలియని వారుండరు. మొదట్లో కొన్ని కండిషన్లతో జనాలకు చిరాకు తెప్పించినా కూడా ప్రస్తుతం మాత్రం కస్టమర్లకు అనుగుణంగా తన సేవలందిస్తు తన వ్యాపారాంలో మంచి జెట్‌ స్పీడ్‌లో పేటిఎం దూసుకుపోతోంది.మొదట్లో డిజిటల్ చెల్లింపు ప్లాట్‌ఫాం వంటి సేవలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చిన పేటీఎంలో ఇటీవల మరికొన్ని సేవలతో పాటు బ్యాంకుల తరహాలో లోన్‌ సదుపాయలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ బ్యాంకులే షాక్‌ తినేలా అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది పేటీఎం. వన్‌ కమ్యూనికేషన్స్(One97 communications) మాతృసంస్థగా పనిచేస్తున్న పేటీఎం కంపెనీ దేశంలోని ఇతర బ్యాంకింగ్ సంస్థలతో కలిసి కొన్ని త్రైమాసికాల క్రితం రుణ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. అయితే ఈ సేవలను ప్రారంభించిన కొత్తలో కొన్ని అవాంతరాలు ఎదురైన వాటిని తట్టుకుని తగ్గేదేలే అన్నట్లుగా రుణ వితరణ రంగంలో తాజాగా భారీ వృద్ధిని నమోదు చేసింది.


కంపెనీ తక్కువ కాలంలోనే తన లోన్ బుక్‌ను చాలా రెట్లు పెంచుకుంది.కంపెనీ రుణ వితరణ వార్షిక ప్రాతిపదికన సెప్టెంబరు నెలలో మొత్తం రూ.34,000 కోట్లకు చేరుకుంది.ఈ విషయాలను కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్స్ లో వెల్లడించింది. పేటీఎం నివేదికలో.. సెప్టెంబర్ 2022తో ముగిసిన త్రైమాసికంలో వెలువడిన ఫలితాల పరంగా.. గతేడాది పోలిస్తే ఈ సారి పంపిణీ చేసిన మొత్తం రుణాల సంఖ్య మూడు రెట్లు పెరిగిందని తెలిపింది. గత సంవత్సరంలో ఈ సంఖ్య 28.41 లక్షలు ఉండగా ఈ సారి 92 లక్షలకు చేరుకున్నట్లు పేర్కొంది.అదే క్రమంలో paytm ద్వారా పంపిణీ చేసిన లోన్ల విలువ.. గత సెప్టెంబరు 2021 త్రైమాసికంలో రూ. 1,257 కోట్లు ఉండగా, ప్రస్తుతం సెప్టంబర్‌లో ఆరు రెట్లు పెరిగి రూ.7,313 కోట్లకు చేరుకుంది. నెలవారీ వృద్ధి చూస్తే కంపెనీ ఈ ఏడాది సగటున రూ.7.97 కోట్లకు చేరుకుంది. సెప్టెంబర్ క్వార్టర్లో ఇది 39 శాతం పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: