పచ్చిపాలతో ఇలా చేస్తే ముఖం మెరిసిపోవడం ఖాయం?

Purushottham Vinay
ప్రతిరోజూ కూడా కేవలం ఒక చెంచా పచ్చి పాలను ఉపయోగించడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు.పచ్చి పాలను ముఖానికి రాసుకుంటే ముఖంపై ఉన్న మృతకణాలు చాలా ఈజీగా ఇంకా త్వరగా తొలగిపోతాయి. పచ్చి పాలను చర్మానికి పట్టించడం వల్ల ముఖం చాలా తాజాగా మారుతుంది. ఇంకా అలాగే దీంతో పాటు పాలు చర్మాన్ని చాలా లోతుగా శుభ్రపరుస్తుంది. లాక్టిక్ యాసిడ్ పచ్చి పాలలో చాలా ఎక్కువగా ఉంటుంది. దీని సహాయంతో మీరు చర్మాన్ని ఈజీగా ఎక్స్‌ఫోలియేట్ చేయవచ్చు. ఇంకా రాత్రి పడుకునేటప్పుడు పచ్చి పాలను ముఖానికి రాసుకున్నట్లయితే మెరిసే చర్మం ఈజీగా మీ సొంతమవుతుంది. ఈ పాలలో లాక్టిక్ యాసిడ్ ఉండటం వల్ల మీ చర్మం బిగుతుగా మారుతుంది. ఇంకా అలాగే టానింగ్ తగ్గించి, ముఖ ఛాయను బాగా కాంతివంతంగా మారుస్తుంది. మీరు పచ్చి పాలను మాయిశ్చరైజర్‌గా కూడా వాడవచ్చు. ప్రతి రోజూ కూడా పచ్చి పాలతో ముఖానికి మసాజ్ చేయడం వల్ల ముడతలు తగ్గుతాయి. ఇంకా అలాగే వృద్ధాప్య సమస్య కూడా చాలా ఈజీగా దూరమవుతుంది.


ఇక ఈ పచ్చి పాలను అప్లై చేయడం వల్ల మొటిమల సమస్య కూడా చాలా ఈజీగా తొలగిపోతుంది. దానికి ఉప్పు కలిపితే మొటిమలు చాలా ఈజీగా నయమవుతాయి. ఇక అలాగే తక్షణ మెరుపు కోసం మీరు పచ్చి పాలను కూడా ఉపయోగించవచ్చు. ఇంకా అలాగే నల్లటి వలయాలు తగ్గాలంటే పచ్చి పాలను కాటన్ ప్యాడ్‌లో తీసుకుని కళ్ల చుట్టూ కూడా రాసుకుంటే నల్లటి వలయాలు చాలా ఈజీగా తగ్గుతాయి. పచ్చి పాలతో ఫేషియల్ టోనింగ్ చేయడం వల్ల ముఖంపై గడ్డకట్టిన డెడ్ స్కిన్ పొర చాలా ఈజీగా తొలగిపోతుంది.మీరు పచ్చి పాలతో ఫేస్ ప్యాక్ ని రెడీ చేసుకోవచ్చు. మీ పాలలో శెనగపిండి ఇంకా అలాగే తేనె కలిపి ముఖానికి అప్లై చేసి ఒక 10 నుండి 20 నిమిషాల తర్వాత ముఖం నుండి తొలగించండి. దీన్ని రెగ్యులర్ గా అప్లై చేస్తే ముఖంలో గ్లో రావడంతో పాటు మచ్చలు కూడా చాలా ఈజీగా తగ్గిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: