ఈ హెయిర్ ప్యాక్ తో జుట్టు సమస్యలన్నీ మాయం?

Purushottham Vinay
చాలా మందికి కూడా జుట్టు రాలడం, జుట్టు తెల్ల బడడం, జుట్టు పొడి బారడం, జుట్టు చిట్లడం వంటి సమస్యలు ఉంటాయి.ఇటువంటి జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడే వారు చాలా ఎక్కువవుతున్నారు. ఈ సమస్యల నుండి బయటపడడానికి చాలా రకాల హెయిర్ స్ప్రేలను, హెయిర్ ప్యాక్ లను వాడుతూ ఉంటారు. బయట కొనుగోలు చేసే పని లేకుండా ఇంట్లోనే తయారు చేసుకున్న న్యాచురల్ హెయిర్ ప్యాక్ ను వాడడం వల్ల మనం ఖచ్చితంగా చక్కటి ఆరోగ్యకరమైన జుట్టును సొంతం చేసుకోవచ్చు. వారినికి ఒకసారి ఈ హెయిర్ ప్యాక్ ను వాడడం వల్ల మన జుట్టు అందంగా ఇంకా కాంతివంతంగా తయారవుతుంది.ఒక కళాయి తీసుకొని అందులో ఒక గ్లాస్ నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు గోరు వెచ్చగా అయిన తరువాత ఇందులో 2 టీ స్పూన్ల ఉసిరి పొడిని వేసి 5 నిమిషాల పాటు బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. నీళ్లు గోరు వెచ్చగా అయిన తరువాత ఇందులో సహజసిద్ధమైన హెన్నా పౌడర్ ను 2 టీ స్పూన్ల మోతాదులో వేసి బాగా కలపాలి. తరువాత ఇందులో 2 టీ స్పూన్ల శీకాయ పొడిని వేసి కలపాలి.


తరువాత ఇందులో 2 టీ స్పూన్ల గుంటగలగరాకు పొడిని, 2 టీ స్పూన్ల మందార పువ్వుల పొడిని వేసి కలపాలి.ఇలా రెడీ చేసుకున్న మిశ్రమాన్ని రాత్రంతా కూడా అలాగే ఉంచి ఉదయాన్నే దీనిని జుట్టుకు శుభ్రంగా ప్యాక్ లా వేసుకోవాలి. కానీ ఈ ప్యాక్ ను నూనె రాసిన జుట్టు మీద వేసుకోకూడదు. హెయిర్ ప్యాక్ వేసుకున్న ఒక గంట తరువాత ఎటువంటి షాంపూ వాడకుండా శుభ్రంగా తలస్నానం చేయాలి. తలస్నానం చేసిన తరువాత జుట్టును పూర్తిగా ఆరనివ్వాలి. తరువాత జుట్టుకు మనం ఎప్పుడూ ఉపయోగించే నూనెను బాగా పట్టించి నూనె ఇంకేలా బాగా మర్దనా చేసుకోవాలి. ఇలా చేసిన మరుసటి రోజూ ఉదయం షాంపుతో బాగా శుభ్రంగా తలస్నానం చేయాలి. ఈ టిప్ తయారీలో వాడిన పొడులన్నీ మనకు ఆయుర్వేద షాపుల్లో లేదా ఆన్ లైన్ లో దొరుకుతాయి. వారినికి ఒకసారి ఈ టిప్ ని వాడడం వల్ల సమస్యలు అన్నీ కూడా తగ్గి జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది.ఇంకా అంతేకాకుండా జుట్టు చాలా కాంతివంతంగా కూడా తయారవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: