యమహా నుంచి మరో రెండు సూపర్ ఇ-స్కూటర్స్..!!

Purushottham Vinay
ఫేమస్ బైక్ ఇంకా స్కూటర్ తయారీ కంపెనీ యమహా (Yamaha) ప్రపంచ మార్కెట్లో మంచి ఆదరణ పొందుతున్న వాహన తయారు కంపెనీ.ఈ కంపెనీ ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ కోసం రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను రిలీజ్ చేయనుంది. ఇక వీటిలో ఒకటి 'యమహా నియో' (Yamaha Neo) కాగా మరొకటి వచ్చేసి 'యమహా ఈ01' (Yamaha E01) ఎలక్ట్రిక్ స్కూటర్. ఇక వీటి గురించి మరింత సమాచారం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.ఇక యమహా కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త ఎలక్ట్రిక్స్ స్కూటర్లు ప్రస్తుతం అభివృద్ధి దశలో వున్నాయి.కాబట్టి కంపెనీ వీటికి త్వరలోనే పరిచయం చేయనుంది. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా ఈ కంపెనీ యొక్క మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్లు కానున్నాయి. కాబట్టి ఇవి ఆధునిక ఫీచర్స్ ఇంకా అలాగే పరికరాలను కలిగి ఉంటాయి.యమహా రిలీజ్ చేయనున్న కొత్త 'యమహా నియో' (Yamaha Neo) కంపెనీ యొక్క మొట్టమొదటి బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ స్కూటర్ అవ్వనుంది. ఇక యమహా ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ పేరుతో 50సీసీ స్కూటర్‌ను అమ్ముతుంది. ఇది 2019 టోక్యో మోటార్ షోలో బ్రాండ్ ద్వారా ప్రదర్శించబడిన E02 కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించబడటం జరిగింది.


ఇక యమహా కంపెనీ ఇప్పటికే 50సీసీ పెట్రోల్‌తో నడిచే నియో స్కూటర్‌ను అంతర్జాతీయ మార్కెట్‌లలో అమ్ముతుంది. త్వరలో రానున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అతిపెద్ద హైలైట్ ఏంటంటే బ్యాటరీ ఎక్స్చేంజ్ టెక్నాలజీ. ఇది రిమూవబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా పవర్ ని పొందుతుంది. అంతే కాకూండా ఇది హబ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారుకు పవర్ ని ఇస్తుంది.అంతేగాక ఇది 2kW రేటింగ్‌ను కూడా కలిగి ఉంటుంది.ఇక యమహా  నియో ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి కంపెనీ ఇంకా ఎటువంటి అధికారిక వివరాలు అనేవి వెల్లడించలేదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ గా మార్కెట్లో అడుగుపెడుతుంది ఆశిస్తున్నాము. ఇక ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కి సంబంధించిన మరింత సమాచారం అంతా కూడా త్వరలోనే కంపెనీ వెల్లడిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: