అదిరిపోయే ఫీచర్లతో లాంఛ్ అయిన హీరో స్కూటర్ ఇదే..!
డెస్టినీ ప్లాటినం వేరియంట్ డిజైన్ తో పాటు మరికొన్ని కీలక మార్పులు చేసింది హీరో సంస్థ. మ్యాస్ట్రో ఎడ్జ్ 125 మోడల్ వలే కనిపిస్తున్న ఈ స్కూటర్లో ఫీచర్ల విషయంలో కొద్దిపాటి మార్పులు చేసింది. హ్యాండిల్ బార్ ఎండ్స్, మిర్రర్లను క్రోమ్ తో ఫినిషింగ్ చేసింది. ఫలితంగా రిచ్, రెట్రో లుక్ తో ఇది ఆకట్టుకుంటోంది. బ్లాక్ మ్యాటీ కలర్లో అందుబాటులోకి వచ్చిన ఈ స్కూటర్లో బ్రౌన్ ఇన్నర్ ప్యానెల్స్ డ్యూయల్ టోన్ బ్రౌన్, బ్లాక్ కలర్ సీటు, ప్రీమియం 3డీ లోగోతో పాటు ప్లాటినం వేరియంట్ బ్యాడ్జింగ్ ఇందులో ఉంది.
ఈ స్కూటర్ అదనంగా ఎల్ఈడీ గైడ్ ల్యాంప్, డిజిటల్ అనలాగ్ స్పీడో మీటర్, సైండ్ స్టాండ్ ఇండికేటర్ మొదలగు అంశాలు యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. డెస్టినీ 125 ప్లాటినం వేరియంట్లో 124.6సీసీ సింగిల్ సిలీండర్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ తో పాటు బ్రాండ్ ఎక్స్ సెన్స్ టెక్నాలజీని పొందుపరిచారు. ఫలితంగా ఇది 7000 ఆర్పీఎం వద్ద 8 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 5500 ఆర్పీఎం వద్ద 10.4 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. మొదలగు మంచి టాక్ తో సేల్స్ దూసుకుపోతున్నాయి