ఎలెక్ట్రిక్ టూ వీలర్ కొనాలనుకుంటే వీటిని ఒకసారి చూడండి..!

Satvika
ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ ధరలను చూస్తే గుండె బరువెక్కుతుంది. అందుకే చాలా మంది ఎలెక్ట్రిక్ వాహనాల వైపు పరుగులు పెడుతున్నారు. కంపెనీలు కూడా అందుకు తగ్గట్లు వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. టూ వీలర్ వాహనాలలో ఏది బెస్ట్ అన్నది ఇప్పుడు ఒకసారి చూద్దాం.. వీటి వల్ల ఎంతో ఇంధనం ఆదా అవుతుంది. మైలేజీ బాగా వస్తుంది. కనుక రవాణా చార్జిలు కూడా తగ్గుతాయి. ఈ క్రమంలోనే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఉత్తమ విద్యుత్ టూవీలర్లు ఏవో, వాటి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం...

ఎనిగ్మా జీటీ-450
ఈ టూవీలర్ గరిష్టంగా 120 నుంచి 140 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది. దీని ధర రూ.64వేల నుంచి రూ.80వేల వరకు ఉంది. ఇది కూడా మార్కెట్‌లో వినియోగదారుల ఆదరణను పొందుతుంది.

రివోల్ట్ ఆర్‌వీ 400
ఈ బైక్ 3వేల వాట్ల మోటార్ ఆధారంగా పనిచేస్తుంది. ఒక్కసారి చార్జింగ్ పెడితే 150 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది. ఈ వాహనం అహ్మదాబాద్‌, చెన్నై, హైదరాబాద్‌, పూణె నగరాల్లోనే అందుబాటులో ఉంది. దీని ధర రూ.1.03 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

బజాజ్ చేతక్
పురాతన చేతక్ మోడల్‌కు మార్పులు, చేర్పులు చేసిన బజాజ్ కొత్త చేతక్ ఎలక్ట్రిక్ వేరియెంట్ రూపంలో అందుబాటులోకి తెచ్చింది.. కాగా ఈ స్కూటర్ ధర కూడా అందుబాటులోనే ఉంటుంది. స్కూటర్ ధర రూ.1 లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు ఉంది. దీనిపై గంటకు గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో వెళ్లవచ్చు. ఒక్కసారి ఈ స్కూటర్‌లోని బ్యాటరీని ఫుల్ చార్జింగ్ చేస్తే ఏకంగా 95 కిలోమీటర్ల వరకు మైలేజీ వస్తుంది. ఇందులో డిస్క్ బ్రేక్ ఆప్షన్‌ను కూడా అందిస్తున్నారు.

ప్యూర్ ఈవీ ఇప్లూటో
ఈ వాహనం ధర రూ.71,999గా ఉంది. దీని బరువు 79 కిలోలే. అందువల్ల సులభంగా హ్యాండిల్ చేయవచ్చు. ఇందులో ఏబీఎస్ ఫీచర్ లభిస్తోంది. ఈ వాహనం గంటకు గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. చార్జింగ్ అయ్యేందుకు నాలుగు గంటలు టైమ్ పడుతుంది. కేవలం ఒక్కసారి చార్జింగ్ చేస్తే 90 నుంచి 120 కిలోమీటర్ల వరకు మైలేజీ వస్తుంది.
వీటి ధర కాస్త పెచ్చుగా ఉన్నా కూడా సామాన్యుడు సైతం వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: