ఆటో మొబైల్ కంపెనీలలో మారుతి కంపెనీ ఒకటి... అప్పటి కాలం నుంచి ఈ కార్లు మార్కెట్ లోకి విడుదల అవుతున్నాయి. ప్రజల మెప్పును కూడా పొందాయి.. కరోనా వల్ల ప్రపంచం చిన్నా భిన్నం అయ్యింది.. అలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఈ కంపెనీ కొత్త కార్లను మార్కెట్విడుదల చేసి మంచి లాభాలను పొందింది. ఆ కారెంటో , ప్రత్యేకతలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.. మారుతీ సుజుకీ క్యూ3లో మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 24.1శాతం వృద్ధితో రూ.1941.4 కోట్లకు ఎగబాకింది.
అంతకుముందు ఏడాది ఇదే సమయంలో కంపెనీ నికరలాభం రూ.1565 కోట్లుగా నమోదైంది. కంపెనీ స్టాండలోన్ రెవిన్యూ 13.3శాతం వృద్ధితో రూ.20,706.8 కోట్ల నుంచి రూ.23,457.8 కోట్లకు పెరిగింది. కంపెనీ పన్నుల వ్యయం రూ.441.6 కోట్ల నుంచి రూ.508.4 కోట్లకు చేరింది. కంపెనీ ఎబిట్టా 5.9శాతం వృద్ధితో రూ.2102 కోట్ల నుంచి రూ.2226 కోట్లకు చేరగా, ఎబిట్టా మార్జిన్ 10.1 శాతం నుంచి 9.5శాతానికి తగ్గింది. అసలు విషయానికొస్తే.. కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తున్న రోజు ల్లో కూడా మారుతి టాప్ రేంజికి లాభాను పొందడం విషయం విశేషమే.
అయితే, పోయిన ఏడాది డిసెంబర్ మూడో వారంలో మిగిలిన కంపెనీలకు షాక్ ఇచ్చింది.. దేశీయ మార్కెట్ వాటా 13శాతం వృద్ధితో 4,67,369 యూనిట్లుగా ఉంది. ఇక 20.6 శాతం వృధ్ధితో 28,528 వాహనాలకు కంపెనీ ఎగుమతి చేసింది. అయితే ఏప్రిల్- డిసెంబర్ తొమ్మిది నెలల కాలంలో మొత్తం 965,626 వాహనాలను విక్రయించింది, అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 18.0శాతం తగ్గింది. ఎగుమతులు, దిగుమతులు ఓ రేంజులో ఉన్నాయని కంపెనీ తాజా ప్రకటనలో వెల్లడించింది. ఎంతైనా గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది మార్చ్ కు భారీగా సేల్స్ పెరగనున్నాయని భావిస్తుంది..