రైతన్నలు వ్యవసాయం చేయడానికి ఒకప్పుడు ఎడ్లు ఉండేవి కానీ ఇప్పుడు మాత్రం టెక్నాలజీ మారింది.. వ్యవసాయ పనిముట్లు కూడా మారిపోయాయి.. ఇప్పుడు వ్యవసాయానికి ఎక్కువగా ట్రాక్టర్ ను ఎక్కువగా వాడుతున్నారు. ప్రజల అవసరాల మేరకు ట్రాక్టర్ కూడా కొత్త ఫీచర్లతో మార్కెట్ లోకి విడుదల అవుతున్నాయి.. ఒక్కో కంపెనీ ఒక్కో విధమైన పద్ధతులను అందిస్తుంది.తాజాగా మార్కెట్ లోకి వచ్చిన ఒక ట్రాక్టర్ మాత్రం యావత్ ప్రజానీకాన్ని ఆకట్టుకుంటుంది. అంతగా ట్రాక్టర్ లో ఉన్న ప్రత్యేకతలు ఎంటో ఇప్పుడు చూద్దాం.
టైగర్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ లో అత్యాధునిక ip67 25.5 కిలోవాట్ల నేచురల్ కూలింగ్ కాంపాక్ట్ బ్యాటరీ తో ఇది నడుస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 24.93 కిలోమీటర్లు. ఒకసారి పూర్తి ఛార్జింగ్ చేశాక 2 టన్నుల ట్రాలీ తో నడిపిన 8 గంటలపాటు బ్యాటరీ సామర్థ్యం కొనసాగుతుందని కంపెనీ వెల్లడించింది.. ఇకపోతే కేవలం నాలుగు గంటల్లో ఫుల్ ఛార్జింగ్ కూడా అవుతుందని అంటున్నారు.డీజిల్ ట్రాక్టర్ ల తో పోలిస్తే ఈ విద్యుత్ డాక్టర్ నిర్వహణ ఖర్చు నాలుగోవంతు మాత్రమే అవుతుందని తెలిపారు. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.5.99 లక్షల వరకు ఉంటుంది.
కాగా, ఇండియా లో ప్రముఖ ట్రాక్టర్ బ్రాండ్ సోనాలిక విస్తృతమైన వినూత్న ట్రాక్టర్లను ప్రజలకు అందిస్తుంది.. హెచ్ పి 20 – హెచ్ పి 90 వరకు అత్యంత ప్రాచుర్యం పొందిన ట్రాక్టర్ మోడల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది.. పంజాబ్ కు చెందిన ప్రముఖ ట్రాక్టర్ల తయారీ కంపెనీ సోనాలిక గ్రూప్ జూన్ నెలలో అన్ని వాతావరణాలకు అనుకూలంగా ఉండే ఎయిర్ కండిషన్, థియేటర్ ఆప్షన్ తో కూడిన హెవీ డ్యూటీ ట్రాక్టర్ వరల్డ్ ట్రాక్ 90 హెచ్ పి ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి విధితమే.. ఈ విద్యుత్ ట్రాక్టర్ మార్కెట్ లోకి వచ్చిన మొదటి ట్రాక్టర్ కావడంతో డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.. ప్రస్తుతం మిగిలిన ట్రాక్టర్ లతో పోలిస్తే ఈ ట్రాక్టర్ ఫీచర్లు జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.. మరిన్ని ఫీచర్లతో కూడిన ట్రాక్టర్ లను అందిస్తామని ఆ కంపెనీ వెల్లడించింది..