డీలర్ల వద్దకు డ్యుకాటి పానిగేల్ వి2.. ధర ఎంతో తెలుసా..?
బైక్ వాలే వెలువరించే తాజా నివేదికల ప్రకారం డ్యుకాటి పానిగేల్ వీ2 భారత మార్కెట్ లో డీలర్ షిప్ ల వద్దకు చేరుతోంది. డీలర్ షిప్ కంపెనీల ఎదుట డిస్ ప్లే మోడళ్లను చూస్తుంటే త్వరలోనే భారత మార్కెట్ లో ఈ బైక్ డెలివరీలు ప్రారంభమవుతాయి. డ్యుకాటి పానిగేవ్ వీ2 బైక్ బీఎస్-6 మోడల్ తో రూపొందించిన మొట్టమొదటి సూపర్ బైక్ ఇది. భారత్ లో ఈ మోడల్ బైక్ మొదటిసారిగా రిలీజ్ అవుతోంది. ఇప్పటివరకూ భారత్ లో విక్రయించిన డ్యుకాటి ఐకానిక్-959, పానిగేల్ మోడల్ స్థానాన్ని రీప్లేస్ చేయడానికి ఈ సరికొత్త మోడల్ ను తీసుకొచ్చింది.
డ్యుకాటి పానిగేల్ వీ2 బైక్ బీఎస్-6 మోడల్ గా రూపొందించారు. ఈ బైక్ లో 955 సీసీ సూపర్ క్వాడ్రో 90 డిగ్రీ వీ2 ఇంజిన్ ను యూజ్ చేశారు. ఈ ఇంజిన్ సామర్థ్యం గరిష్టంగా 10,750 ఆర్పీఎమ్ వద్ద 155 బీహెచ్పీ శక్తిని కలిగి ఉంది. దీంతో పాటు 9000 ఆర్పీఎమ్ వద్ద 104 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీంతో పాటుగా సిక్స్ స్పీడ్ గేర్ బాక్సులను అమర్చారు. 4.3 ఇంచ్ టీఎఫ్ టీ డిస్ ప్లే ను కలిగిఉంది. ఇది రైడర్ కు కావాల్సిన పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. రైడర్లకు అనుకూలంగా రైడల్ అసిస్టెన్స్ ఫీచర్ ను కూడా పొందుపర్చారు. ఇందులో కార్నరింగ్ ఏబీఎస్, ఫుల్ రైడ్ బై వైర్ సిస్టమ్, ఆటో లైర్ కాలిబ్రేషన్, ఇంజిన్ బ్రేకింగ్ కంట్రోల్, వీల్ కంట్రోల్, స్లిప్పర్ క్లచ్ తదితర ఫీచర్లను పొందుపర్చింది.