బెంజ్ నుండి కొత్త ఎస్ 400 రిలీజ్..!

shami
మెర్సిడిస్ బెంజ్ తన సరికొత్త ఎస్ క్లాస్ వెహికల్ ను ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఎస్ 400 వెహికల్ ఈ నెల 29 న రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక ఇప్పటినుండి బెంజ్ ఎస్ 400 తమ తోటి వెహికల్స్ ఎస్ 350 మరియు ఎస్ 500 తో జతకడుతుంది.


ఎస్ క్లాస్ వెహికల్ కు అందవచ్చిన వెహికల్ గా బెంజ్ తన హవా కొనసాగిస్తుంది. ప్రయాణీకుల సౌకర్యార్ధమే ఈ సరికొత్త బెంజ్ ఎస్ క్లాస్ 400ను తయారు చేయబడ్డది. ఇక ఈ వెహికల్ వి6 టర్బో ఇంజిన్ డెవెలపింగ్ సిస్టెంతో 330 బి.హెచ్.పి మరియు 480 ఎన్.ఎం టార్క్ ను కలిగి ఉంటుంది.


ఇక అత్యధిక వేగంగా వెహికల్ నడిచేందుకు దీనిలో 9 గేర్ బాక్సెస్ అందుబాటులో ఉంటాయి.. ఎస్ 400 కింది స్థాయి పరిణామాలు కల వెహికల్ గా వస్తుంది. ఎస్ 500 లో ఉన్న అంత కెపాసిటీ దీనిలో ఉంటుంది. ఇక ఈ ఎస్ క్లాస్ వెహిఉకల్ వి6 డీజిల్ ఇంజిన్ తో వస్తుండగా.. వి8 పెట్రోల్, వి12 కూడా పెట్రోల్ ఆప్షన్స్ తో వస్తుంది. 


ప్రయాణంలో అలసట ఒత్తిడి లేకుండా చాలా ఉల్లాసంగా ఉత్సాహం గా కొనసాగించేందుకు బెంజ్ ఎస్ క్లాస్ వెహికల్స్ వాడుతారు. సాధారణ తరగతి కన్నా కాస్త ఎక్కువ స్థాయి వారు కొనగలిగే ఈ వాహనం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఇక ఈ సరికొత్త మెర్సిడిస్ బెంజ్ ఎస్400 వెహికల్ మార్చ్ 29 నుండి ఇండియాలో అన్ని డీలర్స్ దగ్గర అందుబాటులో ఉంటుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: