క్యాబేజీ వడియాలు

Durga
క్యాబేజీ వడియాలు తయారీకి కావలసినవి : మినపప్పు : ¼ కిలో క్యాబేజీ : అరకిలో  మిర్చి : 25 గ్రాములు జీలకర్ర : 2 చెంచాలు ఉప్పు : తగినంత ఎలా తయారీ చేయాలో చూడండి : మినపప్పు నానపెట్టి పొట్టుతీతీయాలి రోట్లో నానబట్టిన పప్పు, ఉప్పు వేసి మెత్తగా రుబ్బాలి. దాంట్లో సన్నగా తరిగిన క్యాబేజీ, నూరిన అల్లం, జీలకర్ర ముద్ద కలిపి ప్లాస్టిక్ పేపర్ మీద వడియాలు పెట్టుకోవాలి.  ఆరిన తర్వాత తీసి ఒక రోజు మళ్లీ ఎండుబెట్టి డబ్బాలో పెట్టుకోవాలి. గమనిక : ఏ వడియాలకయినా మినప్పిండిని గట్టిగా మెత్తగా రుబ్బుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: