మేతి చమన్

Durga
కావలసిన పధార్థాలు : పెద్ద ఉల్లిపాయలు : 6 జీడిపప్పు : ముద్ద  అల్లం, వెల్లుల్లి ముద్ద : 1టేబుల్ స్పూన్ మెంతికూర : 4 స్సూన (ఫ్రెస్) ఉప్పుకారం గరంమసాలా , తురిమిన పన్నీర్, సన్నగా తరిగిన కొత్తిమీర, మీగడ తయారీ చేయు విధానం : ముందుగా ఉల్లిపాయలు తరగి, నూనెలో వేయించుకోవాలి. ఇందులోనే వలచిన మెంతికూర ఆకులు కూడా వేయించి అవి చల్లారిన మిక్సీ వేయాలి. మళ్లీ మీక్సీలోకి జీడిపప్పులు, అల్లం, వెల్లుల్లి వేసుకుని మిక్సీ చేయాలి. కావాలసి వస్తే నీళ్లుపోసుకుని మిక్సీ చేయవచ్చు. ఈ రెండు గ్రేవీలు చాలా మెత్తగా ఉండాలి.  తరువాత ఒక పాన్ లో నూనెపోసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు మరికొన్ని మెంతికూర ఆకులు, వేయించాలి. అవి వేగినాక ఈ గ్రేవీలు రెండు అంటే ఉల్లిపాయల గ్రేవీ, జీడిపప్పు గ్రేవీ వేసి వేయించి అది కొంచెం చిక్కపడ్డాక అందులో పాలమీగడకానీ, క్రీమ్ కాని వేయాలి. ఉప్పు, కారం, గరంమసాలా, తగినంత వేయాలి. పొడుగ్గా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. తురిమిన పన్నీర్, సన్నగా తరిగిన కొత్తిమీర ఈ కర్రీలో వేసి, పైన క్రీమ్ వేస్తే అందంగా ఉంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: