విజయం మీదే: మంచి ఆరోగ్యమే నిజమైన గెలుపు...

VAMSI
ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది డబ్బు వెంబడి పరుగెడుతూ ఉంటారు. ఏవేవో లక్ష్యాలు అని ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా కష్టపడుతుంటారు. ఈ మార్గంలో అనారోగ్యం బారిన పడుతుంటారు. తద్వారా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. నిజమే ఇప్పుడు నడుస్తున్న కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంటే చాలా కష్టమనే చెప్పుకోవచ్చు. దానికి కారణాలు లేకపోలేదు ప్రస్తుతం తింటున్న ఫుడ్, వాతావరణ ప్రభావం మరియు ఎప్పుడూ బిజీ పనుల వల్ల చాలా మంది అనారోగ్యం పాలవతున్నారనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా... ఓకే ఇప్పుడు మనం అసలు పాయింట్ కి వద్దాం. మనం మన ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చూపినా లేక ఆరోగ్యాన్ని పట్టించుకోక పోయినా మన ఆరోగ్యం మన చెయ్యి దాటిపోయింది అంటే అప్పుడు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం ఉండదు.
అలాగే ఎంత డబ్బు ఉన్నా కూడా చాలా మంది ఆరోగ్యాన్ని కాపాడుకోలేక పాడుచేసుకున్నవారు లేకపోలేదు. అందుకే ఇప్పుడు ఉన్న కాలంలో మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఏం చేయాలో చూద్దాం.
ముందుగా మనం తీసుకునే ఆహారం గురించి మాట్లాడుకుందాం. ఎందుకు అంటే మనం ఎన్ని పనులు చేసినా వాటన్నింటికంటే మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి డైలీ మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, వీలుంటే పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అంతే కాదు తొందరగా జీర్ణం అయ్యే ఫుడ్ తీసుకోవడం ఇంకా మంచిది. అలాగే రాత్రి సమయంలో ఎక్కువ మాంసకృత్తులు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం మరీ మంచిది. ఎందుకు అంటే అవి జీర్ణం అవ్వటానికి ఎక్కువ సమయం పడుతుంది.
అలాగే మన శరీరాన్ని ఫిట్ గా మరియు హెల్తీగా ఉంచుకోవాలి అనుకుంటే మాత్రం తప్పకుండా వ్యాయమం చేయాల్సిందే. రోజుకి 30 మినిట్స్ లేదా ఒక గంట సేపు అయినా తప్పకుండా వ్యాయామం చేయటం మంచిది ఎందుకు అంటే మన వయసు పైబడిన తర్వాత ఎలాగో చేయలేము. కాబట్టి వయసులో ఉన్నపుడే చేయటం మంచిది.   డైలీ మన ఇంట్లో ఉంటూనే ఉదయం నిద్ర లేవగానే నడవడం, రన్నింగ్ చేయటం, డాన్స్ చేయడం లేదా ఇంట్లో సైక్లింగ్ మెషీన్ ఉన్నట్లైతే అది చేయటం వల్ల కూడా చాలా ప్రయోజనాలు పొందవచ్చు. ఇంకా చేయాలి అనుకుంటే చిన్నపాటి బరువులు మోయడం ఇలాంటివి చేయడం వాల్ల కూడా మనం  ఆరోగ్యాన్ని జీవితకాలం కాపాడుకోవచ్చు. కాబట్టి తెలుసుకోండి నిజమైన గెలుపు మంచి ఆరోగ్యమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: