విజయం మీదే: మీరు సున్నితమయిన వారా... అయితే ఇవి తెలుసుకోండి?

VAMSI
మారుతున్న ప్రపంచంతో పాటు మనుషుల ప్రవర్తన కూడా మారుతోంది. ఒకప్పుడు ప్రజలంతా ఒకరికొకరు ఎంతో గౌరవిస్తూ, ప్రేమని పంచుతూ జీవించే వారు చాలా సున్నితంగా ఉంటూ ఎవరిని నొప్పించకుండా ఉండేవారు. దాదాపు అందరూ కూడా ఇలాంటి ప్రవర్తనని కలిగి ఉండేవారు. కానీ ఇపుడు అలాంటి వారి సంఖ్య చాలా తక్కువే. ఇప్పట్లో చాలా మంది తమకి నచ్చని పని ఎదుటి వారు చేసినా, చూసినా వెంటనే రంకులేస్తున్నారు, ఆగ్రహంతో ఊగిపోతున్నారు. వారు బాధపడుతారేమో అని కాస్త అయినా ఆలోచించకుండా తమ కోపాన్ని మాటలతో, చేతలతో చూపించే వారు కూడా లేకపోలేదు. కానీ ఇలాంటి ప్రవర్తన ఎవరికి అంత శ్రేయస్కరం కాదు.
ఇటువంటి ఒక పద్దతి  మీ జీవన ప్రయాణాన్ని ప్రశాంతంగా సాగనివ్వలేదు, గమ్యాన్ని చేరనివ్వదు. మీరు అనుకున్నది సత్వరంగా సాధించి విజయాన్ని అందుకోవాలి అంటే ఇటువంటి వైఖరి ఎన్నటికీ ఉపయోగపడదు. సున్నితత్వం, నమ్మకం అనేవి మిమ్మల్ని మీ విజయానికి చేరువ చేసి గొప్ప స్థానంలో నిలబెడతాయి. సున్నితమైన మనస్తత్వం ఉండడం వలన ఎదుటి వారిలోని భావోద్వేగాలను చక్కగా అర్థం చేసుకుని స్పందించగలరు. అంతే కాకుండా అవతల వారి జీవితంలోని లోటు పాట్లను, కష్ట నష్టాలను అర్థం చేసుకుని మసులుకోగలరు.
చాలా మంది ఇటువంటి వారు ఎందుకు పనికిరారు అంటుంటారు. కానీ  కోపంతో, ద్వేషంతో లేదా భయంతోనో చేసే పనిలో ఎపుడూ కూడా పరిపూర్ణత దొరకదు. సున్నితంగా ఉంటూ ఎదుటి వారికి నెమ్మదిగా, ప్రేమగా చెప్పడం వలన, లేదా వారిని అర్దం చేసుకుని ముందుకు సాగడం వలన అనుకున్నది తప్పక సాధించగలరు. మనము సమాజములో ఎలా ఉన్నామన్నది ముఖ్యం కాదు, ఏ విధముగా మన పనితనం ఉంది అలాగే మనము ఎవరికైనా నష్ట చేస్తున్నామా అన్న విషయాలు మాత్రమే ఆలోచించాలి. కాబట్టి మీరు సున్నితమైన మనస్తత్వం కలవారు అయినా పర్వాలేదు. కానీ ఖచ్చితంగా, మంచిగా, చెడు చేయని వ్యక్తిగా ఉండండి. ఇక మీ విజయాన్ని ఎవ్వరూ దూరం చెయ్యలేరు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: