విజయం మీదే: ఈ విషయంలో జాగ్రత్త పడండి ?

VAMSI
సాధారణంగా చాలా మంది ఇతరుల మాటలకు ఎక్కువగా ప్రభావం అవుతుంటారు. వారి మాటలకు ఈజీగా అట్రాక్ట్ అయ్యి అలా చేసుకు పోతుంటారు. పక్క వారి మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అవడం చాలా మందికి పరి పాటిగా మారింది. మనం తీసుకునే నిర్ణయం ఎటొచ్చీ ఏమి జరుగుతుందోనని చాలా మంది సందిగ్ధంలో పడుతుంటారు. అందుకే అటువంటి అయోమయ పరిస్థితులలో ఇతరుల సలహాలను తెలుసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. అయితే మన సమస్య..లేదా మన విషయం గురించి మనకు తెలిసినంతగా...మనకు అవగాహన ఉన్నంతగా  ఇతరులకు ఉండదు.
కాబట్టి మనకు సంబంధించిన ముఖ్యమైన విషయాల గురించి మనమే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఒక వేళ మరీ అంత కన్ఫ్యూజన్ గా ఉంటే మన అత్యంత సన్నిహితులకు లేదా మన కుటుంబ సభ్యులకో విషయాన్ని చెప్పి వారి అభిప్రాయాన్ని తెలుసుకోవడం మంచిది. అంతే తప్ప కనిపించిన ప్రతి వారికి చెప్పి వారి మాటలకు..సలహాలకు ప్రభావితం కాకూడదు. ఏది ఏమైనా తుది నిర్ణయం మనదై ఉంటే మంచిది. ప్రతి ఒక్కరూ ఈ విషయంలోనే తప్పటడుగులు వేస్తూ ఉంటారు. కానీ జాగ్రత్తగా మీరు నిర్ణయం తీసుకుంటే మీ జీవితంలో చక్కగా ముందు కెళ్లగలరు.
మీరు చాలా కీలకమైన విషయాలకు నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు.. ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నాము..?? దీని ఫలితం ఎలా ఉండొచ్చు..?? ఈ నిర్ణయం ద్వారా అనుకున్న విధంగా విజయం సాధించగలనా..?? ఈ మూడు ప్రశ్నలను మీకు మీరు వేసుకొని బాగా ఆలోచించండి. సరైన నిర్ణయం మీ ముందు నిలబడుతుంది. ఏది ఏమైనా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా రాబోయే పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఒకటికి పదిసార్లు ఆలోచించి తీసుకుంటే... అంతా మంచే జరుగుతుంది. అలాగే ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది మన నిర్ణయం ఇతరులకు హాని చేసేలా అస్సలు ఉండరాదు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: