బోగి మంటలు వెనుక ఇంత కధ ఉందా..?

Divya
సాధారణంగా భోగి పండుగ రోజున ప్రొద్దున లేవగానే ఈ సీజన్ లో చలి కాచుకోవటానికి భోగి మంటలు వేస్తారని చాలామంది అపోహ పడుతూంటారు.కానీ భోగి మంటల వెనుక ఒక సంప్రదాయం ఉందని,మన పురాణాలు బోధిస్తున్నాయి.పురాణాల నుంచి భోగి అనే పదాన్ని భగ అనే పదం నుండి వాడుకోబడినది.భగ భగ అంటే మంటలు అని అర్థం.పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు వామన అవతారంలో వున్నప్పుడు,బలి చక్రవర్తిని మూడు కోర్కెలలో భాగంగా,మూడో అడుగులో ఆయన్ని పాతాళానికి తొక్కి,పాతాళ రాజుగా ఉండమని ఆదేశిస్తాడు.అంతేకాక బోగి రోజున అంటే సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుంచి భూలోకానికి వచ్చి,ప్రజల్ని ఆశీర్వదించమని బలి చక్రవర్తికి చెబుతాడు.ఇలా బోగి రోజున బోగి మంటలు వేయడంతో,బలి చక్రవర్తిని ఆహ్వానించినట్టయి,బలి చక్రవర్తి భూలోకానికి వస్తాడని వేదాలు,పురాణలు చెబుతున్నాయి.
సంక్రాంతి పండుగ ధనుర్మాసంలో వస్తుంది.అందువల్ల ధనుర్మాసం మొత్తం పేడతో గొబ్బెమ్మలు అలంకరిస్తారు.ఈ మాసం మొత్తం ధనుర్మాసం ముగ్గులు వేసి,అందులో ఈ గోబ్బేమ్మలు పెట్టి,ఇళ్ళు వాకిలిని పూజిస్తారు.ఈ గోబ్బేమ్మలలో మధ్య ఉన్నదానిని కృష్ణుడుగా,చుట్టూ వున్నవాటిని గోపెమ్మలుగా భావిస్తారు.ఈ గ్గొబ్బేమ్మలను పెళ్ళికాని ఆడ పిల్లలు పెడితే చాలా మంచిది.ఇలా పెట్టిన గొబ్బెమ్మల  ఆ తర్వాత రోజున వాటిని తీసి,ఎండ బెడతారు.ఇలా ఎండబెట్టిన గొబ్బెమ్మలను బోగి పండుగ రోజున భోగీ మంటల్లో వేస్తారు.ఇలా గొబ్బెమ్మలు ఆవు పేడతో చేస్తారు.కనుక,అవి భోగిమంటల్లో వేసి కాల్చటం వల్ల గాలిలోని సూక్ష్మక్రిములు నశించిపోయి,గాలి శుభ్రం అవుతుంది.ఆవు పేడ నుంచి వచ్చే,ఈ గాలిని పీల్చుకుంటే ఆరోగ్యానికి మంచిది.ఇలా స్వచ్ఛమైన గాలిని పీల్చడం వల్ల,చలికాలంలో ఏర్పడే ఇన్ఫెక్షన్ల దరి చేరకుండా కూడా మనల్ని మనం కాపాడుకోవచ్చు.
అలాగే ఈ భోగిమంటల్లో రావి,మేడి,మామిడి చెట్ల బెరడు కూడా వేయాలి.అలా వేయడంతో మన పూర్వీకులను కూడా తలుచుకున్నట్టు అవుతుంది.ఇలా భోగి మంటల తర్వాత వచ్చే బూడిదను బొట్టుగా పెట్టుకోవాలి.ఇలా చేయడం వల్ల మన పెద్దల ఆశీర్వాదం కూడా మనకు కలుగుతుందని భావిస్తారు.ఈ విదంగా ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో వచ్చే భోగి,సంక్రాంతి,కనుమ పండుగలను ప్రజలందరూ సంబరంగా,ఆనందంగా సాంప్రదాయాలకు అనుగుణంగా జరుపుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: