వారి చేతిలో నాకు ప్రాణ హాని ఉందంటూ.. లేఖ విడుదల చేసిన చంద్రబాబు..!!

Divya
స్కిల్ డెవలప్మెంట్ కేసులు ఏ వన్ ముద్దాయిగా ఉన్న టిడిపి నేత చంద్రబాబు నాయుడు గత నెల రోజులకు పైగా రాజమండ్రి జైల్లో ఉన్న సంగతి అందరికీ తెలిసినదే.. ఎన్నోసార్లు హైకోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ చాలా సార్లు వాయిదా పడుతూనే ఉన్నది.. చాలా మంది ముద్దాయిలు సైతం బెయిల్ తీసుకొని విడుదల అవుతూ ఉండగా చంద్రబాబుకు మాత్రం బెయిల్ దొరకడం లేదు.. ఇవన్నీ పక్కన పెడితే.. చంద్రబాబుని జైల్లో పెట్టడం వల్ల పెద్దగా ఎవరు పట్టించుకోలేదని చెప్పవచ్చు.

టిడిపి నాయకులు మాత్రం చంద్రబాబుని పోలీసు అధికారులు ట్రీట్ చేస్తున్న విధానం బాగా లేదంటే పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు 70 ఏళ్లకు పైబడిన వ్యక్తి చంద్రబాబుకి ఎండ తీవ్రత తట్టుకోలేక స్కిన్ ఎలర్జీకి సంబంధించిన వ్యాధి రావడంతో వైద్యులు అక్కడికక్కడే చికిత్స అందించారు. అయితే కోర్టు ఇచ్చిన ప్రత్యేకమైన అనుమతితో చంద్రబాబు కి ఏసీ ని ఏర్పాటు చేయడం జరిగింది. తాజాగా చంద్రబాబు నాయుడు తనకు ప్రాణహాని ఉందంటూ హైకోర్టు జడ్జికి లేఖ రాయడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది ఈ విషయం.


గత కొద్దిరోజులుగా జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు చుట్టూ జరుగుతున్న కొన్ని సంఘటనలు చాలా అనుమానాస్పదంగా మారుతున్నాయట. స్పై కెమెరాలు మరియు పెన్ కెమెరాలతో టిడిపి కార్యకర్తలు రహస్యంగా చిత్రీకరించినట్లు సమాచారం.. చంద్రబాబు నాయుడుకి నక్సల్స్ నుండి ప్రాణహాని ఉందని తనను చంపడానికి కుట్రలు చేస్తున్నారంటూ తనకు భద్రత కల్పించాలంటూ లేఖలు చంద్రబాబు నాయుడు జడ్జికి రాయడం జరిగింది. చంద్రబాబు నుండే స్వయంగా ఇలాంటి విషయాలు రావడంతో తెలుగుదేశం పార్టీ క్యాడర్ మరియు పార్టీ నాయకులు చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. కుటుంబ సభ్యులు పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. మరి చంద్రబాబు లేకపోయినా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: