మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మన శంకర వర ప్రసాద్ గారు అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. నయనతార ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... అనిల్ రావిపూడి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. కానీ ఏ తేదీన విడుదల చేయబోతున్నాము అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఓ వార్త మాత్రం చాలా రోజులుగా వైరల్ అవుతుంది. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా మొదటగా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందిన రాజా సాబ్ మూవీ విడుదల కానుంది.
ఈ సినిమాను జనవరి 9వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. దానితో రాజా సాబ్ మూవీ విడుదల అయిన తర్వాత ఈ మూవీ రెండు రోజులకు విడుదల అవుతుంది కాబట్టి రాజా సాబ్ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. రాజా సాబ్ మూవీ వాడి వేడి దాదాపు తగ్గాక మన శంకర వర ప్రసాద్ గారు మూవీ ని థియేటర్లలోకి దింపాలి అని మేకర్స్ భావిస్తున్నట్లు అందుకే ఈ సినిమాను జనవరి 12 వ తేదీన విడుదల చేయాలి అనే ప్లాన్ మేకర్స్ చేస్తున్నట్లు ఉన్నారు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతానికి మన శంకర వర ప్రసాద్ గారు మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ను తెచ్చుకొని ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.