2025లో ఆ విషయంలో టాప్ 10లో సూపర్ స్థానాన్ని దక్కించుకున్న అఖండ 2..?

Pulgam Srinivas
2025 వ సంవత్సరం తెలుగు సినిమా పరిశ్రమ నుండి అనేక సినిమాలు విడుదల అయ్యాయి. అందులో బుక్ మై షో ఆప్ లో అత్యధిక ప్రీ సేల్స్ జరుపుకున్న టాప్ 10 స్థానాలలో బాలకృష్ణ హీరోగా రూపొందిన అఖండ 2 అద్భుతమైన స్థానాన్ని దక్కించుకుంది. మరి ఈ సంవత్సరం విడుదల అయిన తెలుగు సినిమాలలో బుక్ మై షో ఆప్ లో అత్యధిక ప్రీ సేల్స్ జరుపుకున్న సినిమాలలో అఖండ 2 మూవీ ఏ స్థానంలో ఉంది అనే వివరాలను తెలుసుకుందాం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఓజి మూవీ కి బుక్ మై షో ఆప్ లో 950 కే ఫ్రీ సేల్స్ జరిగాయి. రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్గా శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చెంజర్ మూవీ కి బుక్ మై షో ఆప్ లో 815 కే ప్రీ సేల్స్ జరిగాయి. పవన్ కళ్యాణ్ హీరోగా నీది అగర్వాల్ హీరోయిన్గా రూపొందిన హరిహర వీరమల్లో సినిమాకు బుక్ మై షో ఆప్ లో 503 కే ఫ్రీ సేల్స్ జరిగాయి. వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు 442 కే ప్రీ సేల్స్ బుక్ మై షో లో జరిగాయి. నాని హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్గా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ కి బుక్ మై షో ఆప్ లో 336 కే ప్రీ సేల్స్ జరిగాయి. నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ 2 మూవీ కి బుక్ మై షో ఆప్ లో 300 కే ఫ్రీ సేల్స్ జరిగాయి. దానితో ఈ సంవత్సరం బుక్ మై షో ఆప్ లో అత్యధిక ప్రీ సేల్స్ జరుపుకున్న సినిమాల లిస్టులో అఖండ 2 మూవీ ఆరవ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: