సూపర్ స్టార్ రజనీ కాంత్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన ఎన్నో సంవత్సరాల క్రితం నటుడిగా కెరియర్ను మొదలు పెట్టి ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకొని కోలీవుడ్ ఇండస్ట్రీ లో ఇప్పటికి కూడా స్టార్ హీరోలలో ఒకరిగా కేరిర్ను కొనసాగిస్తున్నాడు. రజనీ కాంత్ తన కెరియర్లో కొన్ని తెలుగు సినిమాల్లో నటించాడు. ఆయన నటించిన ఎన్నో తమిళ సినిమాలు తెలుగులో విడుదల అయ్యి టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను అందుకోవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా ఆయనకు అద్భుతమైన క్రేజ్ ఉంది. ఇకపోతే సూపర్ స్టార్ రజనీ కాంత్ చాలా సంవత్సరాల క్రితం పడియప్ప అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే.
ఈ సినిమాలో సౌందర్య , రమ్య కృష్ణ హీరోయిన్లుగా నటించగా ... కె ఎస్ రవి కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమాను తెలుగు లో నరసింహ అనే పేరుతో విడుదల చేశారు. ఈ మూవీ తమిళ్ మరియు తెలుగు రెండు ఇండస్ట్రీ లలో కూడా అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే పడియప్ప మూవీ ని తమిళ్ లో తాజాగా రీ రిలీజ్ చేశారు. ఈ మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. ఇకపోతే బుక్ మై షో లో ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 100 కే టికెట్స్ సేల్ అయినట్లు తెలుస్తోంది. రీ రిలీజ్ లో కూడా బుక్ మై షో లో ఈ సినిమాకు సంబంధించిన 100 కే టికెట్స్ సేల్ అవ్వడం తోనే అర్థం అవుతుంది ఈ సినిమా రీ రిలీజ్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.