వీడి ధైర్యం తగలెయ్య.. ప్రాణాలకు తెగించాడుగా?
సాధారణంగా ఎక్కడైనా అగ్నిపర్వతం ఉంది అంటే చాలు అటువైపు వెళ్లడానికి ఎంతో మంది భయపడిపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే అగ్నిపర్వతంలో ఉండే లావా క్షణాల వ్యవధిలో మారన హోమాన్ని సృష్టించగలదు అని చెప్పాలి. ఎప్పుడైనా అగ్నిపర్వతం బద్దలైందంటే చాలు పరిసర ప్రాంతాలలో వినాశనం ఏ రేంజ్ లో ఉంటుందో ఇప్పటివరకు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిన వీడియోలలో చూశామూ. రెప్ప పాటు కాలంలో ఎముకలను సైతం కరిగించే వేడిని కలిగి ఉంటుంది లావా అందుకే ఇక ఇలా మరిగే లావా దగ్గరికి వెళ్లడానికి ఎవరూ ధైర్యం చేయరు.
కానీ ఇక్కడ ఒక వ్యక్తి ప్రాణాల మీద ఆశలు వదిలేసుకున్నాడో ఏమో తెలీదు కానీ ఏకంగా ఎటువంటి భద్రత చర్యలు తీసుకోకుండానే మండుతున్న అగ్నిపర్వతం లావా దగ్గరికి వెళ్లి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోవడంతో ఇది చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు అని చెప్పాలి. దాదాపు 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో మరుగుతున్న లావా దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళాడు. ఇక ఒళ్ళు గగుర్పాటు కల్పించే దృశ్యం నిజమా కాదా అన్నది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇది కేవలం గ్రాఫిక్స్ అని కొంతమంది అంటుంటే పోయేకాలం వస్తే ఇలాంటివే చేస్తారని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.