వైరల్ : పరిగెత్తుకుంటూ వెళ్లి.. అంపైర్ ప్యాంట్ లాగేసిన బౌలర్?

praveen
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది బంతి బంతికీ మారే మ్యాచ్ స్వరూపం.. కన్నార్పకుండా చేసే ఉత్కంఠ. అయితే క్రికెట్ మ్యాచ్ అంటే కేవలం ఉత్కంఠ మాత్రమే కాదు నవ్వు తెప్పించే ఎన్నో సంఘటనలు కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కొంత మంది ఆటగాళ్లు ప్రత్యర్థులతో సరదాగా ఏదో ఒకటి మాట్లాడుతూ నవ్వులు పూయిస్తూ ఉంటారు. మరి కొంతమంది ఏకంగా మైదానంలో ఉన్న సహచరులను  ఆటపట్టించటం లాంటివి కూడా చేస్తూ ఉంటారు.. క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇలా ఏదైనా జరిగిందంటే అందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.


 సాధారణంగా అయితే తన సహచరులు ప్రత్యర్థులు కోచ్ లను ఆటపట్టిస్తూ సరదా పనులు చేసే క్రికెటర్లు అంపైర్ల జోలికి మాత్రం దాదాపు వెళ్లరు అని చెప్పాలి. ఎందుకంటే అమ్మాయిల జోలికి వెళ్తే ఇక అది క్రమశిక్షణ నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుంది. కానీ ఇక్కడ ఒక ఆటగాడు మాత్రం అవేవి పట్టించుకోలేదు. ఎంతో ఉత్కంఠ భరితంగా మ్యాచ్ కొనసాగుతున్న సమయంలో బంతి వేయడానికి వచ్చిన బౌలర్ ఏకంగా అంపైర్ ప్యాంటు ని లాగి పరిగెత్తాడు. దీంతో అక్కడున్న వారందరూ కూడా పగలబడి నవ్వుకున్నారు అని చెప్పాలి. లంక షైర్ క్రికెట్ లీగ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ లో  వైరల్ గా మారింది.



 ఇటీవలే లంకా షైర్, ఈస్ట్ లంక షైర్ క్రికెట్ క్లబ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో భాగంగా బౌలింగ్ వేయడానికి సిద్ధమైన బౌలర్ రన్ అప్ చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే బంతిని చేతిలో ఉంచుకొని బౌలింగ్ వేయకుండా  నేరుగా అంపైర్ వద్దకు వెళ్ళి అతని ప్యాంటు లాగేసాడు.. తర్వాత నవ్వుతూ అక్కడి నుంచి పరిగెత్తాడు. కొంత దూరం వెళ్ళిన తరువాత ఫ్రాంక్ అంటూ అంపైర్కు క్షమాపణ చెప్పాడు.. అయితే ముందుగా అక్కడున్న ఆటగాళ్ళందరూ ఏమీ అర్థం కాలేదు. కానీ అంపైర్ ప్యాంటు ఊడిపోయిన విషయం తెలిసి  కాసేపు అందరూ నవ్వుకున్నారు.  ఇక అక్కడ ఉన్న అంపైర్  కూడా ఈ విషయాన్ని స్పోర్టివ్ గా తీసుకోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: