వావ్.. గాజు గ్లాసులతో వీళ్ళు అద్భుతం చేశారు..!

Satvika
ఇప్పుడు అందరు కొత్తగా ఏదైనా చేయాలనీ అనుకుంటున్నారు. ఒక దెబ్బ తో సెలెబ్రిటీ అయిపొవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ క్రమంలో కొత్త వాటికి స్వీకారం చూడుతున్నారు. ఎన్నో అద్భుతమైన వాటిని నిర్మిస్తూ అదరహో అనిపిస్తున్నారు.. ఇప్పుడు దుబాయి లో కూడా అలాంటి ఒక ఆష్చర్యానికి గురి చేసే ఘటన వెలుగులోకి వచ్చింది. అది ఇప్పుడు వరల్డ్ ఫెమస్ గా రికార్డు ను కైవసం చేసుకుంది.

విషయాన్నికొస్తే.. దుబాయ్ లోని ఓ స్టార్ హోటల్ లో న్యూఇయర్‌ వేడుకలతో పాటు గిన్నీస్‌ వరల్డ్ రికార్డును కూడా బ్రేక్ చేసింది.. గాజు గ్లాసులను ఉపయోగించి వాళ్ళు నిర్మించిన పిరమిడ్ ఇప్పుడు అందరినీ ఆకర్షించింది. వందా కాదు 1000 కాదు ఏకంగా 54వేల 740 గాజు గ్లాసులను 8.23 మీటర్ల ఎత్తులో పిరమిడ్ లా నిర్మించింది. నాలుగేళ్ల క్రితం ఈ హోటలే గాజుగ్లాసుల పిరమిడ్ ను నిర్మించి నెలకిల్పిన రికార్డును బ్రేక్ చేసి మరో కొత్త రికార్డు ను సృష్టించారు..

హోటల్‌లో అట్లాంటిస్, ది పామ్‌ అనే ఈవెంట్ ఆర్గనైజేషన్‌ చేపట్టిన గ్లాస్‌ పిరమిడ్ నిర్మాణంలో మోయట్, చాండన్‌ అనే సోదరులు ఈ పిరమిడ్ ను రూపొందించారు. డిసెంబర్ 30 తేదిన న్యూఇయర్‌కి స్వాగతం పలుకుతూ హోటల్‌కి చెందిన రిసార్ట్‌లోని అసటీర్‌ టెంట్‌లో ఈ విధంగా గాజు గ్లాసుల్ని అందంగా గోపురంగా పేర్చి అందరినీ మంత్ర ముగ్దులను చేశారు. న్యూయర్ సెలెబ్రేషన్స్ కోసం అక్కడకు వచ్చిన వారంతా కూడా ఆ పిరమిడ్ తో ఫోటోలు సెల్ఫీలు తీసుకున్నారు. అది ఇప్పుడు వరల్డ్ రికార్డ్ ను అందుకోవడం తో పాటుగా గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకుంది.2017లో మాడ్రిడ్‌లో కూడా ఇటువంటి రికార్డే సృష్టించారు. 2017లో చేసిన రికార్డులో 50వేల 116 గ్లాసులతో పిరమిడ్ నిర్మించారు. ఆ గ్లాస్ పిరమిడ్ ను మీరు కూడా ఒకసారి చూడండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: