ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం..!

Divya
రాష్ట్రంలో పనిచేస్తున్న రాష్ట్ర ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురును అందిస్తూ తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కరికి హర్షదాయకంగా మారింది.ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం అందించిన తీపి కబురు విషయానికి వస్తే.. ఈ మధ్యకాలంలో చాలామంది సర్వీస్ లో ఉండగానే వివిధ కారణాలవల్ల వైకల్యానికి గురవుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే తప్పని పరిస్థితుల్లో ఉద్యోగిని విధుల నుంచి తప్పించాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు శుభవార్తను అందిస్తూ తాజాగా ఒక నిర్ణయం తీసుకుంది.
అదేమిటంటే వివిధ రకాల కారణాలతో వైకల్యానికి గురైన ప్రభుత్వ ఉద్యోగిని విధుల నుంచి ఎట్టి పరిస్థితుల్లో తొలగించరాదు అని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంగవైకల్యానికి గురైన వ్యక్తి పనిచేయగలిగే పోస్టులో నియమించాలని కూడా స్పష్టం చేసింది ఈ మేరకు కేంద్రం తీసుకొచ్చిన దివ్యాంగుల హక్కుల చట్టం - 2016  లోని సెక్షన్ 20(4)ను అన్ని శాఖలు కూడా తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇకపోతే వైకల్యానికి గురైన ఉద్యోగి పని చేయడానికి వీలుగా పోస్ట్ లేకపోతే అదే శాఖ పరిధిలో ప్రత్యేక పోస్టు సృష్టించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.  ఇక ఈ నియామకంలో సదరు ఉద్యోగి హోదా లేదా జీతభత్యాలు ఇతర ప్రయోజనాల్లో కూడా ఎటువంటి తగ్గింపు ఉండకూడదు అని కూడా వెల్లడించింది.. పదోన్నతి కూడా క్రమం తప్పకుండా అందించాలని స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం వీటన్నింటిని తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి అటు ఉద్యోగుస్తులే కాదు వారి కుటుంబ సభ్యులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగుల సేవలను పొంది వారు అంగవైకల్యానికి గురైనప్పుడు వారిని పదవుల నుంచి తొలగించి వారి కుటుంబాలను అనాధలుగా మార్చడం కంటే ఇలాంటి నిర్ణయం చాలా బెటర్ అని మరి కొంతమంది చెప్పుకొస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: