ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ సినిమా చూసి ఆయన ఫ్యాన్స్ మండిపడుతున్నారు.ముఖ్యంగా డైరెక్టర్ మారుతిని ఇంటికెళ్లి కొడతాం అంటూ వార్నింగ్ లు ఇస్తున్నారు. మరి ఇంతకీ ప్రభాస్ ఫ్యాన్స్ కి అంత కోపం తెప్పించేలా మారుతి ఏం చేసేయరయ్యా అంటే ప్రభాస్ కి ది రాజా సాబ్ సినిమా ద్వారా అతి పెద్ద డిజాస్టర్ ని ఇచ్చేశారు. అయితే మారుతి డైరెక్షన్లో ప్రభాస్ సినిమా చేయడానికి ఒప్పుకున్నారని తెలియగానే చాలామంది ప్రభాస్ అభిమానులు తెగ ఫీల్ అయిపోయారు.అసలు ప్రభాస్ ఈ మారుతీ డైరెక్షన్ లో సినిమాకి ఎందుకు ఒప్పుకున్నారని అనుకున్నారు. కానీ ప్రభాస్ కి మారుతి చెప్పిన స్టోరీ మీద నమ్మకం ఉంది కాబట్టే సినిమా ఒప్పుకున్నారని ఆ తర్వాత రియలైజ్ అయిపోయారు. కానీ రిజల్ట్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పలేం.
తాజాగా విడుదలైన ది రాజా సాబ్ మూవీ అట్టర్ ఫ్లాప్ అని, సినిమా అస్సలు బాలేదని చాలామంది ప్రభాస్ అభిమానులు రివ్యూ ఇస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మారుతి సినిమా అవుట్ పుట్ మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమా బాలేకపోతే నా ఇంటికొచ్చి అడగండి అన్నట్లుగా సవాల్ విసిరి తన ఇంటి అడ్రస్ కూడా చెప్పారు. అలా తాజాగా ది రాజా సాబ్ సినిమా చూసిన ఓ అభిమాని మీడియా ముందు రివ్యూ ఇస్తూ.. మారుతి గాడి **** పగలగొట్టాలి ఫస్ట్ అంటూ స్టార్ట్ చేసి.. కొల్లా లగ్జారియా విల్లా నెం. 17, కొండాపూర్..వాడి ఇంటి అడ్రస్ చెప్పాడు. ఇంటికి వెళ్లి కొట్టాలి ఫస్ట్.. అని రివ్యూ ఇచ్చాడు.దాంతో అసలు మీకు సినిమాలో ఏం నచ్చలేదని ప్రశ్నించగా.. సినిమాలో అస్సలు ఏమీ లేదు. నాన్సెన్స్ వాడి నోటికొచ్చింది తీశాడు.
అందులో స్టోరీ ఏం లేదు. అంతా సోది.. లాస్ట్ లో 30 మినిట్స్ బ్యాంగ్ అన్నాడు. 2 రెండున్నర గంటలు సోది తీసి లాస్ట్ 30 నిమిషాలు ఫైట్ సీక్వెన్స్ పెట్టాడు. పెద్ద వేస్ట్ మూవీ అంటూ మండిపడ్డాడు. ప్రస్తుతం ఈ రివ్యూ చూసిన చాలామంది మీమర్స్ సోషల్ మీడియాలో డైరెక్టర్ మారుతి పై మీమ్స్ వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు. ఇక మారుతి తట్టా బుట్టా సర్దుకొని అండర్ గ్రౌండ్ లోకి వెళ్లాల్సిందే అని కొంతమంది అంటే.. మరి కొంతమందేమో అంత పెద్ద బిల్డప్ ఇచ్చావు ఈ మాత్రం సినిమా కోసమేనా అంటూ ఫైర్ అవుతున్నారు. ఏది ఏమైనప్పటికీ డైరెక్టర్ మారుతి రాజా సాబ్ సినిమా మీద ఎక్కువ హోప్స్ పెట్టుకొని తప్పు చేశాడని సినీ విశ్లేషకులు అంటున్నారు.