నాలుగు కెమెరాలతో “మేట్‌ 20 లైట్‌” స్మార్ట్ ఫోన్

స్మార్ట్ ఫోన్స్ ని తయారు చేసే దిగ్గజ సంస్థలలో ఒకటి అయిన హువాయే ఎప్పటి కప్పుడు మార్కెట్ ని ఆకట్టుకోవడానికి నూతన మొబైల్స్ ని దింపుతూనే ఉంటుంది..ఈ మొబైల్ రంగ సంస్థకి అన్ని దేశాలలో కంటే కూడా భారత మార్కెట్ లోనే అధికశాతం మార్కెట్ ఉండటంతో ఇక్కడి ప్రజల అభిరుచులకి తగ్గట్టుగానే మొబైల్స్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుంది..అందులో భాగంగానే.

 

హువావే తాజాగా తన నూతన స్మార్ట్‌ఫోన్‌ను “మేట్‌ 20 లైట్‌” ను భారత మార్కెట్ విపణిలో ఆవిష్కరించింది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్‌ 5 వరకు బెర్లిన్‌లో జరిగిన ఐఎఫ్‌ఏ 2018 ఈవెంట్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేశారు...ఈ మొబైల్ లో అధునాతన ప్రాసెసర్‌తో పాటు మొత్తం నాలుగు కెమెరాలతో ఉండటంతో హువాయ్ మార్కెట్ ని పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు..

 

అంతేకాదు  ఏఐ (ఆర్టిఫీషియల్‌ ఇంటెలి జెంట్‌) ఆధారిత క్యూట్‌ స్పీకర్‌ను కూడా విడుదల చేసింది. ఇక ఇతర ఫీచర్ల గా ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పాటు 6.3 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే, 2340ఐ ,1080 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌, దాంతో పాటు  ఆక్టాకోర్‌ హై సిలికాన్‌ 710 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌, 6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ వరకూ ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం ఉంది. 2402 ఎంపీ డ్యుయల్‌ బ్యాక్‌ కెమెరా, 2402 ఎంపీ డ్యుయల్‌ సెల్ఫీ కెమెరా దీనిలో ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: