పిఠాపురంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ట‌ఫ్పా.. ఉఫ్ఫా?

RAMAKRISHNA S.S.
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పోటీ చేస్తున్న ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి  జిల్లాలోని పిఠాపురం నియోజ‌క వ‌ర్గంలో పోటీ ఎలా ఉంటుంది?  అనేది ఆస‌క్తిగా మారిన విష‌యం తెలిసిందే. దేశ విదేశాల్లోని వారు కూడా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న నియోజ‌క‌వ‌ర్గం పిఠాపురం. ఆది నుంచి ఇక్క‌డ కాపుల డామినేష‌న్ ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో ఇక్క‌డ ప‌వ‌న్ విజ‌యంపై జ‌న‌సేన నాయ‌కులు ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే.. తాము చేస్తున్న సంక్షేమం త‌మ‌కు మేలు చేస్తుంద‌ని వైసీపీ నాయ‌కులు అంచ‌నా వేసుకు న్నారు.

మొత్తంగా చూస్తే.. పిఠాపురంలో అయితే..ఫైట్ ట‌ఫ్‌గానే క‌నిపిస్తోంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌ర‌ఫున జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్లు.. ఇంటింటికీ తిరుగుతున్నారు. ప‌వ‌న్‌ను గెలిపించాల‌ని కోరుతున్నారు.మ‌రోవైపు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ప‌వ‌న్‌కు అనుకూలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇవ‌న్నీ ఇలా ఉంటే.. మెగా కుటుంబం కూడా రంగంలోకి దిగింది వ‌రుణ్ తేజ్‌.. తాజాగా పిఠాపురం ప‌రిధిలో రోడ్ షో చేసి.. ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. అంటే.. మొత్తంగా ప‌వ‌న్ వైపు నుంచి ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

ఇక‌, వైసీపీ నాయ‌కురాలు వంగా గీత విష‌యానికి వ‌స్తే.. నియోజ‌క‌వ‌ర్గంలో ఆమె కూడా.. ప్ర‌చారం జోరుగానే సాగిస్తున్నార‌ని చెప్పాలి. అంతేకాదు.. రాజీనామాలు చేసిన వలంటీర్లు కూడా.. పార్టీ త‌ర‌ఫున ప్ర‌చారంలో ఉన్నారు. ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం స‌హా.. మిథున్‌రెడ్డి వంటివారు కూడా చాలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. అంటే.. ఇటు ప‌క్షం కూడా.. ట‌ఫ్‌గానే ఫైట్‌ను ముందుకు తీసుకువెళ్తోంది. ఈ పోరులో ఎవరు గెలుస్తార‌నేది ఆస‌క్తిగా మారింది. మ‌రి ట‌ఫ్ ఫైట్‌లో ఎవ‌రు విజ‌యం ద‌క్కించుకుంటార‌నేది చూడాలి.

ఎలాచూస్తున్నా.. ఉఫ్ అనుకునే ప‌రిస్థితి మాత్రం క‌నిపించ‌డం లేదు. జ‌న‌సేన అధినేత ప‌ట్ల అభిమానం ఉన్నా.. అది పూర్తి స్థాయిలో అయితే.. ఏక‌ప‌క్షం కాద‌న్న‌ది వాస్త‌వం. వైసీపీ వైపు నుంచి కూడా బ‌ల‌మైన పోరు క‌నిపిస్తున్న నేప‌థ్యంలో ఉఫ్ అనుకునే స్థాయిలో అయితే.. పిఠాపురం ఓట‌రు తీర్పు చెప్పే ప‌రిస్థితి లేదు. మొత్తంగా ఎన్నికల ప్ర‌చారానికి మ‌రో 15 రోజుల గ‌డువు ఉన్న నేప‌థ్యంలో పార్టీలు మ‌రింత‌గా ప్ర‌చారం ముమ్మ‌రం చేయ‌నున్నాయి. ఆ త‌ర్వాత‌.. ఎటువైపు ప్ర‌జ‌లు మొగ్గు చూపుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: