పల్నాడు :టెన్షన్.. టెన్షన్.. గా మాచర్ల పోలింగ్..!

FARMANULLA SHAIK
ఆంధ్రప్రదేశ్లో సోమవారం ఉదయం ఏడు గంటలకు 175 అసెంబ్లీ స్థానాలకు 25 లోక్సభ స్థానాలకు  పోలింగ్ ప్రారంభమైనది. అయితే ఎక్కడ కూడా ఎలాంటి ఉద్రిక్తత చోటు చేసుకోకుండా ఎన్నికల అధికారులు ఎక్కడికక్కడ భద్రతా చర్యలు చేపట్టారు.పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉదయం 5.30గంటలకు మాక్‌ పోలింగ్‌ కూడా చేపట్టారు.పోలింగ్‌ ఏజెంట్ల సమక్షంలో పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాలకు వేర్వేరుగా ఈ మాక్‌ పోలింగ్‌ ను నిర్వహించారు.పల్నాడు జిల్లా రెంటచింతలలో టీడీపీ వర్గీయులు దూకుడు పెంచి రెచ్చిపోతున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో దాడులకు పాల్పడుతున్నారు.ఆదివారం నాడు తెదేపా పోలింగ్‌ ఏజెంట్ల ఇళ్లకు వెళ్లి బెదిరించి ఏజెంట్లుగా ఉండొద్దని హెచ్చరించారు.పోలింగ్ ప్రారంభం కాకముందే పౌరుషలా గడ్డ పల్నాడులో టీడీపీ, వైసీపీ నేతల మధ్య కొన్ని చోట్ల తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. పల్నాడు జిల్లాలోని రెంటచింతల గ్రామంలో ఒకవైపు పోలింగ్ జరుగుతుంటే ఇంకొక వైపు టిడిపి వైసిపిల మధ్య ఘర్షణ జరిగి కర్రలతో రాళ్లతో కలబడ్డారు.ఈ దాడుల్లో వైసీపీకి చెందిన రెండు కార్లు ధ్వంసమయ్యాయి. ముగ్గురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. వెంటనే విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీంచారు అక్కడ వాళ్ళందరిని అదుపులోకి తీసుకున్నారు.

అలాగే రెంటచింతల మండలం రెంటాలలో కూడా వైసీపీ ఏజంట్లపై టిడీపీ వాళ్లు దాడిచేసేసరికి ఈ ఘటనలో వారికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారి స్థానంలో మరో ఇద్దరు ఏజెంట్లను అధికారులు అనుమతించారు.మరోవైపు, ఈ దాడి ఘటనపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలింగ్‌ ప్రారంభానికి ముందే పల్నాడులో గొడవలపై కన్నెర్రజేసింది. తక్షణం పరిస్థితిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది. అవసరమైతే అదనపు బలగాలను తరలించి సమస్యాత్మక ప్రాంతాల్లో మొహరించేలా చూడాలని జిల్లా అధికారులను ఆదేశించింది.అలాగే పల్నాడు జిల్లాలోని నరసరావుపేట మండలం పమిడిపాడులో కూడా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.పోలింగ్ జరుగుతున్నప్పుడు పోలింగ్ బూత్ లలో రిగ్గింగ్ కు పాల్పడేందుకు టీడీపీ వర్గం వాళ్లు కొత్త దారి నిర్మాణం ఏర్పాటుస్తున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంపై ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. పోలీసుల ప్రమేయంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విధంగా పల్నాడు పోలింగ్ హీట్ టెన్షన్ టెన్షన్ గా నడుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: