కృష్ణ జిల్లాలో ఇప్పటివరకు ఓటింగ్ పరిస్థితి ఇదే..!

Pulgam Srinivas
కృష్ణా జిల్లాలో మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక ఈరోజు ఉదయం 6 గంటలకే ఈ ఏడు నియోజ కవర్గాలకు సంబంధించిన పోలింగ్ స్టార్ట్ అయింది. అంతా అనుకున్నట్లే వేసవి కాలం కావడం 10 దాటితే ఎండలు జోరుగా ఉండటంతో ఉదయాన్నే ఓటు హక్కును వినియోగించుకోవడానికి కృష్ణా జిల్లా వాసులు ఎంతో ఉత్సాహాన్ని చూపించారు. అందులో భాగంగా ఉదయం ఆరు గంటలకే పోలింగ్ స్టార్ట్ కాగా 9 గంటల వరకు మంచి శాతం లో కృష్ణా జిల్లాలో నమోదు అయ్యింది.

ఇకపోతే మొత్తం కృష్ణా జిల్లాలో పామర్రు , గన్నవరం , గుడివాడ , అవనిగడ్డ , పెనమలూరు , పెడన , మచిలీపట్నం అని ఏడు నియోజక వర్గాలు ఉన్నాయి. ఇందులో పామర్రు నుంచి కూడా ఉదయం ఆరు గంటలకే ఓటర్లు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే 9 గంటల వరకు ఈ ప్రాంతంలో మంచి శాతం ఓటింగ్ జరిగింది. ఇక గన్నవరం అసెంబ్లీ నియోజక వర్గం వస్తే ఇక్కడ కూడా ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు మంచి ఓటింగ్ శాతం జరిగింది.

ఇక గుడివాడ విషయానికి వస్తే ఇక్కడ కూడా ప్రజలు ఉదయం నుండే ఓటు వేయడానికి ఉత్సాహాన్ని చూపించారు. దానితో తొమ్మిది గంటల వరకు మంచి ఓటింగ్ శాతం ఈ నియోజక వర్గం లో జరిగింది. ఆ తర్వాత అవని గడ్డ నియోజక వర్గం లో కూడా 9 గంటల వరకు మంచి ఓటింగ్ శాతం నమోదు అయింది. ఇక పెనమలూరు నియోజక వర్గం లో 9 గంటల వరకు పర్వాలేదు అనే స్థాయిలో ఓటింగ్ జరిగింది.

ఇక పెడనా విషయానికి వస్తే ఇక్కడ కూడా ఉదయం ఓట్లు వేయడానికి జనాలు ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నట్లు తెలుస్తుంది. దానితో ఉదయం 9 గంటల వరకే ఇక్కడ మంచి శాతం ఓటింగ్ నమోదు అయింది. ఇక మచిలీపట్నం విషయానికి వస్తే ఈ ప్రాంతంలో 9 గంటల వరకు మంచి ఓటింగ్ శాతం నమోదు అయింది. ఇలా కృష్ణా జిల్లాలోని ఏడు నియోజక వర్గాలలో కూడా ఎక్కువ శాతం ఓటర్లు ఉదయం ఓటును వినియోగించుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: