పవన్ 100 శాతం విక్టరీ... ఇకపై టార్గెట్ అదేనా..?

Pulgam Srinivas
పవన్ కళ్యాణ్ 2014వ సంవత్సరంలో జనసేన అనే ఓ రాజకీయ పార్టీని స్థాపించాడు. ఇక పార్టీని స్థాపించిన తర్వాత అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్లకు మధ్య చాలా తక్కువ వ్యవధి ఉండడంతో ఆ దఫా పవన్ తన పార్టీని ఎలక్షన్లలో దింపలేదు. 2019వ సంవత్సరం వరకు అనగా 5 సంవత్సరాలు భారీ ఎత్తున ప్రచారాలను చేసి ఆ దఫా తన పార్టీని రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల్లో నిలిపాడు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి అసెంబ్లీ, పార్లమెంటు స్థానంలోనూ తన అభ్యర్థులను ఉంచాడు. ఇక ఆ రిజల్ట్ పవన్ కి దిమ్మతిరిగిపోయే షాక్ ను ఇచ్చింది.

ఈ పార్టీ నుండి కేవలం ఒకే ఒక్క వ్యక్తి గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టగా, ఒక పార్లమెంట్ స్థానం కూడా ఈ పార్టీకి రాలేదు. అలాగే జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాలలో రెండింటిలోనూ ఓడిపోయాడు. ఇలా షాక్ తగిలే రిజల్ట్ వచ్చిన తర్వాత పవన్ ఆలోచనలో పడ్డాడు. మరో ఐదు సంవత్సరాలు కూడా అలుపెరుగని పోరాటం చేశాడు. అందులో భాగంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏమాత్రం చీలకూడదు అనే ఉద్దేశంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బలమైన ప్రత్యర్ధులు అయినటువంటి తెలుగుదేశం, బిజెపితో పొత్తు పెట్టుకున్నాడు.

ఇక ఈ పొత్తు అద్భుతంగా వర్కౌట్ అయింది. పొత్తులో భాగంగా పవన్ కేవలం 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలను మాత్రమే తీసుకున్నాడు. ఇక తీసుకున్న ప్రతి స్థానంలోనూ తన అభ్యర్థులను గెలిపించుకున్నాడు. దానితో ఏకంగా 100% రిజల్ట్ జనసేన సొంతం అయ్యింది. కూటమికి కూడా భారీ ఎత్తున సీట్లు రావడంతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఇకపై కొత్త పరిణామాలు ఆంధ్రప్రదేశ్ లో ఉండబోతున్నాయి. పవన్ 2014లో పార్టీ పెట్టి, 2019లో భారీ ఎదురుదెబ్బ తగిలిన తర్వాత 2024లో అద్భుతమైన స్థానానికి చేరుకున్నాడు.

ఇక 2029 ఎలక్షన్లే టార్గెట్ గా పవన్ పని చేయాల్సి ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు వీరికి 100% విజయాన్ని ఇచ్చిన ప్రజలు ఈ నేతపై గొప్ప అంచనాలు పెట్టుకున్నారు. ఆయన వాటన్నింటినీ నెరవేర్చగలిగినట్లు అయితే 2029లో తన సత్తా మరో చాటుతాడు. అదే కానీ జరిగితే వచ్చే ఎన్నికలలో పవన్ తన పార్టీ నుండి చాలా మంది సభ్యులను నిలబెట్టి , గెలిచి సీఎం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక పవన్ నెక్స్ట్ టార్గెట్ సీఎం కాబట్టి ఆ లక్ష్యాన్ని త్వరలోనే చేరుకుంటాడు అని జనసైనికులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: