లారెన్స్ ను వెంటాడుతున్న దెయ్యం సెంటిమెంట్ !

Seetha Sailaja
కొరియోగ్రాఫర్ గా టాప్ పొజిషన్ లో కొనసాగుతున్న రోజులలో లారెన్స్ దర్శకుడుగా నటుడుగా మారాలని చేసిన ప్రయత్నాలు విజయవంతం అవ్వడంతో దక్షిణాది సినిమా రంగంలో అతడి పేరు మారుమ్రోగిపోయింది. అతడు దర్శకత్వం వహించి నటించిన ‘కాంచన’ సూపర్ హిట్ అవ్వడంతో ఆసినిమాకు సీక్వెల్స్ గా వచ్చిన ‘కాంచన 2’ ‘కాంచన 3’ బాగా సక్సస్ అయ్యాయి.

అయితే దెయ్యం కథలు తనకు బాగా కలిసి వస్తున్నాయని భావించిన లారెన్స్ ఇదే తరహా కథలతో వరసపెట్టి సినిమాలలో నటించడంతో అతడి ఇమేజ్ బాగా తగ్గిపోయింది. లేటెస్ట్ గా రజనీకాంత్ బ్లాక్ బష్టర్ మూవీ ‘చంద్రముఖి’ సినిమాకు సీక్వెల్ గా ‘చంద్రముఖి 2’ లో నటించడంతో అతడి పై మరన్ని సెటైర్లు పెరిగిపోయాయి. దీనితో అతడి సినిమాల మార్కెట్ కూడ బాగా తగ్గిపోయింది అని అంటున్నారు.  

ఇలాంటి పరిస్థితులలో తగ్గిపోయిన తన ఇమేజ్ ని నిలబెట్టుకోవడానికి ‘కాంచన 3’ మూవీకి రంగం సిద్దం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పాన్ ఇండియా మూవీగా ఈసినిమాను తెలుగు తమిళ హిందీ భాషలలొ నిర్మించి ఒకేసారి విడుదల చేస్తారని అంటున్నారు. గత కొంతకాలంగా దర్శకత్వ బాధ్యతలకు దూరంగా ఉన్న లారెన్స్ మళ్ళీ ‘కాంచన 4’ తో తిరిగి రంగప్రవేశం చేయబోతున్నాడు. ఈసినిమాను రాబోతున్న సెప్టెంబర్ లో మొదలుపెట్టి వచ్చే సంవత్సరం సమ్మర్ రేస్ కు తీసుకు రావాలనె ప్లాన్ లో లారెన్స్ ఉన్నట్లు టాక్.

ఇప్పుడు ఈవార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొంతమంది లారెన్స్ ను టార్గెట్ చేస్తూ సెటైర్లు వేస్తున్నారు. దెయ్యాల సినిమాల సీజన్ అయిపోయిందని మారిన ట్రెండ్ ను గ్రహించకుండా లారెన్స్ దెయ్యాల కామెడీని నమ్ముకుని మళ్ళీ కొత్త ప్రయత్నం చేయడం ఏమిటి అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈసారి లారెన్స్ దర్శకత్వం వహిస్తూ నటించబోయే సినిమా కథ డిఫరెంట్ గా ఉంటుంది అంటూ కాలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తున్న నేపధ్యంలో తిరిగి లారెన్స్ హవా మొదలయ్యే ఆస్కారం ఉంది..    


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: