శర్వానంద్ లక్ పై అంచనాలు !

Seetha Sailaja
తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల హడావిడి పూర్తి అయిపోవడంతో జనం రొటీన్ లైఫ్ లోకి వస్తున్నారు. దేనికితోడు స్కూల్స్ కాలేజీలు కూడ తెరుస్తూ ఉండటంతో పూర్తిగా హాలిడే మూడ్ నుండి జనం బయటపడుతున్నారు. ఎండలు కూడ తగ్గిపోవడంతో ఇక నుంచి అయినా ప్రేక్షకులు ధియేటర్లకు వస్తారా అన్న అంచనాలు మొదలయ్యాయి.

దీనికి తగ్గట్టుగానే ఈవారం ఏకంగా 11 సినిమాలు ఒకదాని పై ఒకటి పోటీగా విడుదల అవుతున్నాయి. ఈసినిమాలలో శర్వానంద్ నటించిన ‘మనమే’ మూవీ పై మంచి అంచనాలు ఉన్నాయి. కొన్ని నెలలుగా ధియేటర్లకు దూరంగా ఉన్న ఫ్యామిలీ ప్రేక్షకులను ఈమూవీ ధియేటర్లకు రప్పిస్తుందని ఈమూవీ నిర్మాతలు చాల ఆశగా ఉన్నారు. ‘హాయ్ నాన్న’ సినిమా తరహాలో చైల్డ్ సెంటిమెంట్ ఎంటర్ టైన్మెంట్ లు కలిపిన డిఫరెంట్ కథ ఈమూవీ అని అంటున్నారు.

శర్వానంద్ ఎదురు చూస్తున్న హిట్ ఈమూవీ ఇస్తుందని ఒక అంచనా. అయితే ఈమూవీతో పోటీగా విడుదల అవుతున్న కాజల్ ‘సత్య భామ’ పై కూడ మంచి అంచనాలు ఉన్నాయి. ఈమూవీలో కాజల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చాల రఫ్ అని లీకులు వస్తున్నాయి. అయితే ఈవారం రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పాయల్ రాజ్ పుత్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ‘రక్షణ’ మూవీ కూడ ఒక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ కావడంతో ఈమూవీ కూడ ఊహించని వీజయాన్ని చేరుకుంటుందా అన్న వార్తలు వస్తున్నాయి.

ఈసినిమాతో పాటుగా నవదీప్ హీరోగా నటించిన ‘లవ్ మౌళి’ మూవీ  యూత్ కు బాగా నచ్చుతుంది అని అంటున్నారు. ‘లవ్’ రొమాన్స్ కు సమండించిన సీన్స్ ఈమూవీలో ఎక్కువ అన్న ప్రచారం జరుగుతోంది. ఒకనాటి గ్లామర్ క్వీన్ కాజల్ ఫెయిల్ల్యూర్ గా ముద్రపడిన రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పాయల్ రాజ్ పుత్ లు ఒకరి పై ఒకరు పోటీ పడతాం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి పరిస్థితుల మధ్య శర్వానంద్ కాజల్ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పాయల్ రాజ్ పుత్ లలో ఈ వారం విజేత ఎవరు అన్న ఆశక్తి అందరిలోనూ ఉంది.. .




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: