అది ఫెక్ న్యూస్... అస్సలు నమ్మకండి... నాగబాబు..!

Pulgam Srinivas
కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంటు ఎన్నికల్లో జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికలలో తెలుగు దేశం , జనసేన , బిజెపి మూడు పార్టీలు కలిపి పొత్తులో భాగంగా పోటీలోకి దిగాయి. ఇక కూటమి కి ఈ సారి అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలలో అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. జనసేన పార్టీ 21 అసెంబ్లీ , 2 పార్లమెంటు స్థానాలలో పోటీ చేస్తే 21 అసెంబ్లీ , 2 పార్లమెంట్ స్థానాలలో కూడా గెలిచి 100% రిజల్ట్ ను దక్కించుకుంది.

ఇకపోతే మొదటి నుండి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెంటే ఉండి అతనికి వెన్ను దండుగా నిలిచిన వ్యక్తులలో అతని సోదరుడు నాగబాబు ఒకరు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుండి గెలుపు , ఓటమిలో ఆయనకు బలంగా , భరోసాగా ఉంటూ వచ్చిన నాగబాబు పవన్ కి ఈ స్థాయి రిజల్ట్ రావడంతో ప్రస్తుతం ఆనందంలో మునిగిపోయి ఉన్నాడు.

ఇక కూటమిలో భాగంగా 21 అసెంబ్లీ , 2 ఎంపీ స్థానాలను తీసుకొని అన్నింటిలో విజయం సాధించడంతో జనసేన పార్టీలోని వ్యక్తులకు చాలా కీలక పదవులు తప్పే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా జనసేన పార్టీ లో అత్యంత కీలకమైన వ్యక్తి అయినటువంటి నాగబాబు కు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ పదవి ని ఇచ్చినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

ఇక ఈ వార్త వైరల్ కావడంతో నాగబాబు దీనిపై స్పందించారు ... ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదు. ఏదైనా పదవి ఇచ్చినా కానీ దానిని అధికారికంగా ప్రకటిస్తారు. అలాంటి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎలాంటి వార్తలను స్ప్రెడ్ చేయకండి అని నాగబాబు తన సోషల్ మీడియా ద్వారా ఓ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక గెలుపు తర్వాత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి నరేంద్ర మోడీని కలిశారు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చిన పవన్ నేరుగా తన సోదరుడు అయినటువంటి చిరంజీవి ఇంటికి వెళ్లి తన తల్లి మరియు పెద్దల ఆశీర్వాదం తీసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: