అల్లు అర్జున్: స్నేహమా.. బంధుత్వమా.. క్లారిటీ ఇచ్చినట్టేనా..?
టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. తనకంటూ ఒక సపరేటు ఫ్యాన్ బెస్ ని సంపాదించుకున్న అల్లు అర్జున్ ముఖ్యంగా మెగా కుటుంబంలో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ కి సపోర్టు కూడా చేయడం జరిగింది.. అయితే అనుకోకుండా నంద్యాల నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థికి మద్దతు ఇవ్వడంతో అందరూ అల్లు అర్జున్ ని ఏకిపారేశారు. అయితే ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ ఈ విషయం పైన క్లారిటీ ఇవ్వడం జరిగింది.
సోమవారం రోజున జూబ్లీహిల్స్ లో బిఎస్ఎన్ఎల్ పోలింగ్ బూత్ లో అల్లు అర్జున్ ఓటు వేస్తున్న సమయంలో అనంతరం మీడియాతో మాట్లాడడం జరిగింది. తనకు రాజకీయ పార్టీలతో ఎటువంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు.తన మామయ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మాత్రమే తన మద్దతు ఉంటుందంటూ వెల్లడించారు.. అలాగే నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తనకు 15 సంవత్సరాలుగా మిత్రుడు గానే ఉన్నారని శిల్పా రవికి తన మద్దతుని గతంలో కూడా ఎన్నోసార్లు ప్రకటించాలని అలాగే మాట కూడా ఇచ్చానని తెలిపారు.
రాజకీయాలతో సంబంధం లేకుండా స్నేహితుడు కి మాత్రమే తను మద్దతు ఇచ్చానని తెలియజేశారు. శిల్పా రవికి మద్దతుగా నంద్యాలకు వెళ్ల నాకు రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశం అసలు లేదని కూడా వెల్లడించారు అల్లు అర్జున్.. అయితే దీన్ని బట్టి చూస్తే అల్లు అర్జున్ రాబోయే రోజుల్లో జనసేన పార్టీలో కూడా కనిపించారని చెప్పవచ్చు.. గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీల కనిపించినప్పటికీ ఈమధ్య కాలంలో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయినప్పటికీ జనసేన కార్యకర్తలు అల్లు అర్జున్ ని ట్రోల్ చేయడంతో అల్లు అర్జున్ అభిమానులు కూడా స్నేహానికి వాల్యూ ఇచ్చే హీరో మా హీరో అంటూ అదిరిపోయే కౌంటర్లు వేస్తున్నారు.