ఏపీ: జగన్, చంద్రబాబులలో ఎవ‌రిది అసలైన విశ్వ‌స‌నీయ‌త‌..?

Suma Kallamadi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈసారి వైసీపీ అధినేత, ప్రస్తుత సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మధ్య హోరాహోరీ పోటీ నెలకొన్నది. వీరిలో ఎవరిపై ప్రజలకు ఎక్కువ విశ్వసనీయత, నమ్మకం ఉంది అనేది ప్రస్తుతం బిగ్గెస్ట్ క్వశ్చన్ గా మారింది. దీనికి సరైన సమాధానం ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ద్వారానే తెలుస్తుంది. జ‌గ‌న్ పై ప్రజలకు నమ్మకం ల‌క్ష‌ణంగా ఉందని అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన చెప్పినట్లు సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు అందజేశారు.
 ప్రతి గ్రామంలో అన్ని ప్రాథమిక సౌకర్యాలను అందిస్తూ పల్లె ప్రజల జీవితాలను అత్యంత సుఖవంతంగా మార్చేశారు. చంద్రబాబు హయాంలో వృద్ధులు, మహిళలు పనులు మానుకొని పెన్షన్, సంక్షేమ పథకాల కోసం ఆఫీసుల ఎదుట లైన్‌లో నిల్చోవలసి వచ్చేది. కానీ ఆ పరిస్థితిని జగన్ పూర్తిగా మార్చేశారు ఆ ఇబ్బందులను తలనొప్పులను తొలగించారు. ఆర్థిక సహాయాలు అందిస్తూ ఎంతోమంది జీవితాలను బాగు చేశారు. వృద్ధులకు నెల నెలా పెన్షన్ అందజేస్తూ వారు గౌరవంగా బతికేలాగా చూస్తున్నారు.
జగన్ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి పనులు కూడా జెట్‌ స్పీడ్ తో దూసుకెళ్లాయి. అయితే ఒకటి రెండు విషయాల్లో ప్రజల నమ్మకాన్ని జగన్ కోల్పోయారు. అదేంటంటే మ‌ద్యపాన నిషేధం, సీపీఎస్. ఇవి రెండు ఏ సీఎం అమలు చేయాలని తలచినా అది కష్టమే. నిజానికి వీటిని కూడా విజయవంతంగా అమలు చేయాలని జగన్ ప్రయత్నించారు. కానీ అందుకు అలవాటు పడిన జనాలు వాటిని బ్యాన్ చేయడంతో వింతగా ప్రవర్తించడం స్టార్ట్ చేశారు. అలాంటి వారి మంచి కోసమే లిక్కర్ బ్యాన్ చేయకుండా ఊరుకున్నారు. కానీ ఆల్కహాల్ కూడా తాగకుండా ఆపడానికి అనేక మంచి చర్యలు తీసుకున్నారు. ఈ ఒక‌టి రెండు త‌ప్ప‌.. మిగిలిన‌వ‌న్నీ ఆయ‌న చెప్పిన‌వే చేశారు. చంద్ర‌బాబు మాత్రం ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయారు. చంద్రబాబు, అతని కుమారుడు లోకేష్, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు బాగుపడటమే తప్ప పేదవారిని, మధ్య తరగతి వారిని చంద్రబాబు బాగు చేసిన దాఖలాలు లేవు. కాబట్టి ప్రజలకు బాబోరు కంటే జగన్ పైనే ఎక్కువ విశ్వసనీయత ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: