టివి: ఆరేళ్లకే ఎంట్రీ.. 16 ఏళ్లకే పెళ్లి.. బోల్డ్ రోల్స్ తో నటి..!

Divya
ఏ ఇండస్ట్రీలో నైనా సరే హీరోయిన్గా ఎదగడం అంటే అంత ఆశ మాసి కాదు. ఎన్నో అవస్థలు నాన ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది.అలా హీరోయిన్గా చాలా మంది పైకి వచ్చినవారు ఉన్నారు. అయితే ఇలాంటి వాటిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ఊర్వశి దోలాకియా కూడా ఒకరు. ఈమె గురించి హిందీ టీవీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..2001 లో హిందీ టీవీ సీరియల్స్ కసౌటీ జిందగీ కేల విలన్ గా కూడా నటించింది.

అలాగే ఈ నటి పూర్తి విషయానికి వస్తే ఆరేళ్ల వయసు ఉండగానే తన యాక్టింగ్ కెరీర్ ని మొదలుపెట్టింది. ఆ తర్వాత ఎన్నో బి గ్రేడ్ చిత్రాలలో కూడా నటించింది అలాగే వ్యాంపు పాత్రలలో కూడా నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఎన్నో పాత్రలలో ఊర్వశి తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా లక్స్ సోప్ టీవీ యాడ్ లో రేవతి తోపాటు కూడా నటించింది. బబుల్ అనే చిత్రం ద్వారా మొదటిసారి చైల్డ్ యాక్టర్ గా తన ఎంట్రీ ఇచ్చింది.

దేఖ్ బాయ్ దేఖ్ అనే సీరియల్ ద్వారా నటించి 16 ఏళ్లకే వివాహం చేసుకొని ఆ తర్వాత భర్త నుంచి విడిపోయి చాలా ఇబ్బందులను ఎదుర్కొంది. ఒకానొక సందర్భంలో ఈమె దగ్గర డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడ్డాను అని కూడా తెలియజేసింది అలాంటి సమయంలోనే స్వప్నం అనే బి గ్రేడ్ సాఫ్ట్ పోర్న్ చిత్రాలలో కూడా నటించాలని తెలియజేసింది. ప్రస్తుతం ఈమె వయసు 45 సంవత్సరాలు అయినప్పటికీ కూడా కుర్ర హీరోయిన్లకు దీటుగా తన అంద చందాలతో ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా బిగ్ బాస్ ఆరవ సీజన్లో కూడా ఈమె విజేతగా నిలిచింది.. ఎన్నో అవార్డులను కూడా అందుకున్న ఘనత సంపాదించుకుంది ఊర్వశి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: