ఏపీ: కూటమి- వైసిపి నేతల మధ్య గొడవ.. ఆందోళనలో ప్రజలు..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికలు ఈ రోజున ఎట్టకేలకు జరగబోతున్నాయి.. దీంతో ఎలాంటి అవాంఛన సంఘటనలు జరగకుండా ప్రభుత్వం  కేంద్ర బలగాలను తీసుకు వచ్చినప్పటికీ ఇప్పుడు తాజాగా పల్నాడు జిల్లా రెంటచింతల మండలంలో ఉద్రిక్తత నెలకొంది.. ముఖ్యంగా అక్కడ టిడిపి వైసిపి నేతల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే అక్కడ ముగ్గురు టిడిపి పోలింగ్ ఏజెంట్లకు కూడా గాయాలైనట్టుగా సమాచారం. మరో ఇద్దరి పరిస్థితి కూడా విషయంగానే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఆ తర్వాత వారి స్థానంలో మరో ఇద్దరిని కూర్చోబెట్టినట్లుగా సమాచారం.. మాక్ పోలింగ్ పూర్తయిన తర్వాత రెగ్యులరింగ్ పోలింగ్ ప్రారంభిస్తున్న సమయంలో ఇలాంటి సంఘటనలు జరిగినట్లుగా అక్కడ అధికారులు తెలియజేశారు. దీంతో రెంటచింతల గ్రామంలో భారీగానే పోలీసులు సైతం మోహరించినట్లుగా సమాచారం . కడప జిల్లాలోని కమలాపురం మండలంలో కూడా వైసిపి టిడిపి కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల వాతావరణ చెడగొడుతోందంటూ అక్కడి స్థానిక నేతలు ప్రజలు కూడా ఆందోళన చేపడుతున్నారు.

ముఖ్యంగా ఎన్నికలు ప్రశాంతంగా అయ్యేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఓటర్లు సైతం పోలీసులకు విన్నవించుకుంటున్నారు.. మరి ఇలాంటి పరిస్థితులలో ఓటర్సు వచ్చి ఓట్లు వేస్తారా అనే అనుమానం కూడా మొదలవుతోంది. ఇప్పటికే ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ ప్రశాంతంగా జరగాలని అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశామని కూడా వెల్లడించారు. కానీ కొన్నిచోట్ల మాత్రం ఇలాంటి గొడవలు జరుగుతూ ఉండడంతో.. ఓటర్లు కూడా ఓటు వేయడానికి ముందుకు రావడానికి సంకోచిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి తరుణంలో ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి. ముఖ్యంగా అన్ని ప్రాంతాలను మానిటరింగ్ చేస్తున్నామనే విధంగా అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేసుకున్నామని వెల్లడించారు. అవసరమైన ప్రతిచోట కూడా బలగాలను మరింత ఎక్కువగానే పంపిస్తున్నామంటూ వెల్లడిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: