లోక‌ల్ టీడీపీ రెడ్డి Vs నాన్ లోక‌ల్ వైసీపీ రెడ్డి... వైసీపీ గోల్డ్ కోట‌లో గెలిచేది ఎవ‌రో ?

RAMAKRISHNA S.S.
- మార్కాపురం నాగార్జున‌ను గిద్దలూరుకు షిఫ్ట్ చేసిన జ‌గ‌న్‌
- వైసీపీ 81 వేల రికార్డు మెజార్టీతో గెలిచిన సీట్లో రెడ్ల స‌మ‌రం
- సానుభూతిపై, కూట‌మి వేవ్‌పై ఆశ‌లు పెట్టుకున్న టీడీపీ అశోక్‌
( ప్రకాశం - ఇండియా హెరాల్డ్ )
ఏపీలో అధికార వైసీపీకి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పులివెందుల తర్వాత భారీ మెజార్టీ వచ్చిన కంచికోట అది. ఇంకా చెప్పాలి అంటే అది కంచుకోట అనడం కంటే బంగారు కోట అని చెప్పాలి. 2019 ఎన్నికలలో ఏకంగా 81 వేల భారీ మెజార్టీతో అక్కడ నుంచి వైసీపీ గెలిచింది. అలాంటి బంగారపు కోటలో ఈసారి గెలిచేందుకు వైసీపీ ఆపసోపాల పడుతోంది. పైగా జగన్ సైతం గత ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యేను ఇక్కడి నుంచి వేరే నియోజకవర్గానికి బదిలీ చేసి.. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అని తీసుకువచ్చి ఇక్కడ పోటీలో పెట్టారు. ఇటు టీడీపీ నుంచి కూడా రెడ్డి నేత అటు వైసిపి నుంచి కూడా రెడ్డి నేత పోటీలో ఉండడంతో ఈసారి అక్కడ రెడ్ల సమరం హోరాహోరీగా సాగనుంది.

ఆ నియోజకవర్గం ఏదో కాదు ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం లో ఉన్న ఇక్కడి నుంచి మార్కాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ముత్త‌ముల అశోక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. నియోజకవర్గాల పూన‌ర్విభ‌జ‌న‌ తర్వాత జరిగిన మూడో ఎన్నికలలోను టీడీపీ ఓడిపోయింది. 2009లో ప్రజారాజ్యం నుంచి గెలిచిన అన్నా రాంబాబు.. 2014లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడారు. 2014లో గెలిచిన అశోక్ రెడ్డి 2019లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడారు. గిద్దలూరు నియోజకవర్గ ఓటరు అభ్యర్థిని చూసి కాకుండా పార్టీ గుర్తు చూసి గెలిపిస్తున్నారని మాట వాస్తవం. నియోజకవర్గంలోని కంభం తురిమెళ్ళ, రాచర్ల మండలాల్లో బలిజ సామాజిక వర్గం కాపు వ‌ర్గం ఓట‌ర్లు ఎక్కువ.

అందుకే ఇక్కడ నుంచి 2009లో ప్రజారాజ్యం అభ్యర్థి గెలిచారు. 2014లో మాత్రం పిడతల సాయి కల్పనా రెడ్డి బలపరిచిన అశోక్ రెడ్డికి నియోజకవర్గ ప్రజలు ఓట్లు వేశారు. అశోక్ రెడ్డి పార్టీ మారిన 2019లో మాత్రం వరుసగా రెండోసారి ఇక్కడ వైసీపీని గెలిపించారు. నియోజకవర్గ ప్రజలు ఇక గత ఎన్నికలలో మార్కాపురం నుంచి వైసీపీ తరఫున గెలిచిన నాగార్జున రెడ్డిని ఈ ఎన్నికలలో జగన్ గిద్దలూరుకు తీసుకువచ్చారు. అలాగే గిద్దలూరులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అన్న రాంబాబును మార్కాపురం కు షిఫ్ట్ చేశారు. ఇలా పక్కపక్క నియోజకవర్గం వైసీపీ పరస్పరం మార్చింది. వాస్తవంగా చూస్తే నియోజకవర్గంలో వైసీపీ బలంగా ఉంది. అశోక్ రెడ్డి గత ఎన్నికలలో ఓడిపోయిన సానుభూతితో పాటు అందర్నీ కలుపుకు పోతారు అన్న పేరు ఉంది.

ఐదేళ్లలో ఆయన పార్టీ చేరికలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. పలు గ్రామ గ్రామాలను టీడీపీలోకి తీసుకువచ్చారు. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పడుతుందని వైసీపీ నేతలు ఇచ్చిన హామీ బుట్ట దాఖ‌లు అయింది. అయితే చంద్రబాబు ఈ విషయంలో సుముఖతతో ఉన్నారు. పైగా నాగార్జున రెడ్డి గిద్దలూరు నాన్ లోకల్ కావటం కూడా మైనస్ గా మారింది. ఏది ఏమైనా ఈసారి గిద్దలూరులో టీడీపీ లోకల్ రెడ్డి.. అశోక్ వైసీపీ నాన్ లోకల్ రెడ్డి నాగార్జున మధ్య హోరాహోరి సంగ్రామం అయితే జరగనుంది. ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీ యే అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: