టెక్నాలజీ పెరిగిపోయిన కారణంగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ స్కామ్ భయపెడుతుంది. ఈ స్కా లో స్కామర్‌లు కొత్త ఆధార్-ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (AePS)లోని లొసుగును ఉపయోగించి మీ బ్యాంక్ ఖాతాను జీరో చెయ్యొచ్చు.ఈ స్కామ్‌లో, మోసగాళ్లు వేలిముద్ర డేటా, ఆధార్ నంబర్ మరియు బ్యాంక్ డీటెయిల్స్ యాక్సెస్ చేసి బ్యాంక్ ఖాతా నుండి డబ్బును దొంగిలించవచ్చు. ఈ స్కాంలో వారికి OTP కూడా అవసరం లేదు.ఈ స్కాంలో అసలు మీ ఖాతా నుండి మీ డబ్బు డెబిట్ చేయబడిందని మీకు SMS నోటిఫికేషన్ కూడా అందదు. సైబర్ కేఫ్‌లు, ఫోటోకాపీ దుకాణాలు, హోటళ్లు మొదలైనవి ఆధార్ నంబర్‌లు దొంగిలించబడే ప్రధాన ప్రదేశాలు.అలాగే బ్యాంకు పేరును తెలుసుకోవడానికి స్కామర్‌లు బాధితులను వెంబడిస్తారు కూడా. బ్యాంక్ హోల్డర్ల వేలిముద్రలను యాక్సెస్ చేయడానికి, స్కామర్లు వారి ల్యాండ్ రిజిస్ట్రీ ఇంకా ఇతర వనరులను కనుగొంటారు. ఈ వేలిముద్ర డేటా కృత్రిమ సిలికాన్ బ్రొటనవేళ్లపై ముద్రించబడుతుంది, ఇది AePSని ఉపయోగించి డబ్బును డ్రా చేసుకోడానికి ఉపయోగించబడుతుంది.
ఈ స్కామర్ల నుండి ఎలా సురక్షితంగా ఉండాలంటే..స్కామ్ నుండి సురక్షితంగా ఉండటానికి, మీరు తప్పనిసరిగా mAadhaar యాప్ లేదా uidai వెబ్‌సైట్‌ని ఉపయోగించి మీ ఆధార్ బయోమెట్రిక్ డేటాను లాక్ చేయాలి. AePSని నిలిపివేయడానికి మరియు మీ ఆధార్ కార్డ్ యొక్క బయోమెట్రిక్ డేటాను లాక్ చేయడానికి, mAadhaar యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి. సైన్ అప్ చేయడానికి మీ ఆధార్-లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌ను ఉపయోగించండి. మీ ఆధార్ వివరాలను ధృవీకరించండి. ఇంకా యాప్‌ని ఉపయోగించి మీ బయోమెట్రిక్‌ను లాక్ చేసే ఆప్షన్ ఎంచుకోండి. మీకు అవసరమైనప్పుడు యాప్‌ని ఉపయోగించి బయోమెట్రిక్‌లను అన్‌లాక్ చేయవచ్చు.మీ మొబైల్‌లో google Play Storeని తెరిచి, mAadhaar యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి. ఐఫోన్ అయితే, యాప్ స్టోర్‌ని ఉపయోగించండి. mAadhaar యాప్‌కు అవసరమైన పర్మిషన్స్ అనుమతించండి. మీ ఫోన్‌లో mAadhaar ఇన్‌స్టాల్ అయ్యాక యాప్ పాస్‌వర్డ్‌ను సెట్ చేయండి.పాస్వర్డ్ ఖచ్చితంగా 4 అంకెలు (అన్ని సంఖ్యలు) కలిగి ఉండాలని గమనించండి.