ఏపీ: టిడిపిలో కొత్త వివాదం లేపిన కొలికపూడి..!

Divya
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఏపీ రాజకీయాలలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నారు. సొంత పార్టీలోనే కొరకరాని కొయ్యగా మారుతున్నారు. ఆయన తీరు ఒక్కోసారి మంచికి పోతున్న చెడు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా స్థానిక నేతలతో వివాదాల వల్ల సొంత పార్టీ వాళ్లే దూరం పెడుతున్నారు. గతంలో రోడ్ల సరిగ్గా లేవని, మద్యం షాపుల వ్యవహారం పైన మాట్లాడారు. ఆ మధ్య విజయవాడ ఎంపీ కేసీనేని చిన్ని పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మాఫియాను మించిపోయారని తనకు టికెట్ ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్ చేశారు అంటూ పలు రకాల ఆరోపణలు చేశారు.


ఈ విషయాల పైన టిడిపి అధిష్టానం ఎంట్రీ ఇవ్వడంతో ఈ విషయం సర్దు మునిగింది. అయితే ఇప్పుడు ఈ వివాద చల్లారింది అనుకునేలోపు ఇప్పుడు మరో విషయాన్ని బయటికి తీశారు. కొలికపూడి  వాట్సాప్ స్టేటస్ లో పెట్టిన విషయాలు టిడిపిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. విజయవాడ కేశినేని చిన్ని పైన మరొక్కసారి తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన స్టేటస్లో "నువ్వు దేనికి అధ్యక్షుడివి..? పేకాట క్లబ్ కా, కొండ పర్వ గట్టు దగ్గర డే అండ్ నైట్ మ్యాచ్ పేకాట కోసం ఆఫీసు పెట్టావంటే నువ్వు నిజంగా రాయల్"  అంటూ తన వాట్సప్ స్టేటస్ లో పెట్టారు.



అయితే ఈ స్టేటస్ విస్సన్నపేట మండల టిడిపి అధ్యక్షుడు అయిన రాయలసుబ్బారావునే టార్గెట్ చేస్తూ పెట్టారని అయితే ఈయన ఎంపీ చిన్ని వర్గానికి చెందిన వ్యక్తి అన్నట్టుగా ప్రచారమైతే జరుగుతోంది. ఇప్పుడు కొలికపూడి పెట్టిన ఈ వాట్సప్ స్టేటస్ తిరువూరులో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం పైన పొలిటికల్ పరంగా కూడా చర్చ జరుగుతోంది. మరి ఈ విషయం పైన టిడిపి హై కమాండ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. మరి ఈ అంశాన్ని కూడా క్రమశిక్షణ కమిటీకి అప్పచెబుతుందా? లేకపోతే ఎంపీ చిన్ని స్పందిస్తారా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనాప్పటికీ కొలకపూడి వ్యవహారం టిడిపి గత కొన్ని నెలలుగా వినిపిస్తూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: