మీ ఫ్రెండ్ లేదా లవర్ మిమ్మల్ని బ్లాక్ చేశారో లేదా ఇలా తెలుసుకోండి ?

VAMSI
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉండటం సహజం... అంతేకాదు అందులో వాట్సాప్‌ ఉండడం కూడా కంపల్సరీ అయిపొయింది. అంతే కాదండోయ్ అసలు ఈ యాప్‌ లేనిదే ఏ స్మార్ట్‌ఫోన్‌ ఉండదు అంటే నమ్మండి. చిన్న వాళ్ళ దగ్గ నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు నిత్యం వాట్సాప్‌ చాటింగ్‌లలో మునిగి తేలుతుంటారు. అయితే యూజర్ల కోసం ఎప్పటికప్పుడు వాట్సాప్ లో కొత్త కొత్త ఫీచర్స్‌ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఆలా ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఇక ఇప్పుడు వాట్సాప్‌లో మనల్ని ఎవరు బ్లాక్‌ చేశారో తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా..? అయితే అందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెల్సుకుందాం.
 వాట్సాప్‌లో కొన్ని ప్రైవసీ కారణాల వల్ల మనల్ని ఎవరు బ్లాక్ చేశారో నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోలేకపోయే వాళ్ళు. అయితే ఇప్పుడు కొన్ని పద్ధతులను అనుసరించటం వలన మనల్ని ఎవరు బ్లాక్ చేశారో చాలా సులభంగా ఇట్టే తెలుసుకోవచ్చు. అంతేకాదు ఎవరైనా మిమ్మల్ని బ్లాక్‌ చేస్తే ముందుగా ప్రొఫైల్ పిక్చర్ ద్వారానే తెలుసుకునే అవకాశం ఉంది. మనకి అవతలి వారి ప్రొఫైల్ పిక్చర్ కనిపిస్తే.. వాళ్లు మిమ్మల్ని బ్లాక్ చేయనట్లే.. అలాకాకుండా కనిపించకపోతే మాత్రం వాళ్ళు కచ్చితంగా బ్లాక్ చేసినట్లే. దానిని తెల్సుకోవాలి అంటే ఇందులో ఉన్న ఇతర పద్ధతులు కూడా ఫాలో అవ్వండి.
ఒకవేళ ఎవరైతే  మిమ్మల్ని బ్లాక్ చేశారని అనుకుంటున్నారో.. వారి యొక్క లాస్ట్ సీన్, అలాగే ఆన్‌లైన్ స్టేటస్ చెక్ చేయడానికి ప్రయత్నం చేయండి. అయితే అవతలి వాళ్లు లాస్ట్ సీన్ డిజేబుల్ చేస్తే మాత్రం బ్లాక్ చేయకపోయినా కనిపించదు. అంతేకాకుండా ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించకపోతే మాత్రం కచ్చితంగా బ్లాక్ చేసినట్లే. అంతేకాదు ఒకవేళ అవతలి వ్యక్తులు మిమ్మల్ని బ్లాక్ చేస్తే.. సెండ్ చేసిన మెసేజ్ కి కేవలం ఒక్క టిక్ మాత్రమే వస్తుంది. అలాగే రెండు టిక్ మార్కులు, బ్లూ టిక్స్ కనిపించవు. కాబట్టి  మెసేజ్ పెట్టి ఎంత సేపయినా ఈ టూ లేదా బ్లూ టిక్స్ రాకపోతే వాళ్ళు మిమ్మల్ని దాదాపు బ్లాక్ చేసినట్లేనని గుర్తించాలి. అంతే కాకుండా బ్లాక్ చేసిన వారికి కాల్ చేస్తే ఆ కాల్ అవతలివారికి వెళ్లదు. అంతేకాదు అక్కడ రింగింగ్ బదులు కాలింగ్ అని మాత్రమే వస్తుంది.
అయితే ఇందులో ఇంకోటి కూడా ఉంది అవతలివాళ్లు ఇంటర్నెట్ ఆపినా కూడా కాలింగ్ అనే వస్తుంది. అంతేకాదు వాట్సాప్‌లో ఎవరైనా బ్లాక్ చేస్తే.. వారితో గ్రూప్ క్రియేట్ చేయడం కూడా కుదరదు. అందుకే ఎవరైతే బ్లాక్ చేశారని అనుకుంటున్నారో వారితో గ్రూప్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించి కూడా తెలుసుకోవచ్చు . అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది... ఒకవేళ అవతలివాళ్లు వాళ్ళ ప్రొఫైల్ పిక్చర్ డిలీట్ చేసి, లేక లాస్ట్ సీన్ హైడ్ చేసి, అలాగే నెట్ ఆఫ్ చేసినా కూడా పైవన్నీ జరుగుతాయి. అయితే ఇక్కడ ఇంకో విషయం నెట్ ఆఫ్ చేసిన వాళ్లు కాసేపటికి అయినా ఆన్ చేస్తారు కాబట్టి.. పైన చెప్పినవన్నీ జరిగితే దాదాపు బ్లాక్ చేసినట్లే అని కంఫార్మ్ చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: