BMW ఎలక్ట్రిక్ సైకిల్ మాములుగా లేదుగా..

ఇక జర్మనీకి చెందిన ఫేమస్ లగ్జరీ కార్ అండ్ మోటార్‌సైకిల్ బ్రాండ్ bmw, ఓ సరికొత్త ఎలక్ట్రిక్ సైకిల్ ను ఆవిష్కరించడం జరిగింది. ఇక జర్మనీలోని మునిచ్ నగరంలో జరుగుతున్న 2021 IAA ఆటో షోలో bmw i Vision AMBY (బిఎమ్‌బ్ల్యూ ఐ విజన్ యాంబీ) పేరుతో ఓ బ్యాటరీ ఆపరేటెడ్ పెడల్ ఎలక్ట్రిక్ సైకిల్ ను కంపెనీ ప్రదర్శించడం జరిగింది.మరో ఆసక్తికరమైన విషయం ఎంటంటే, ఈ bmw i Vision AMBY ఎలక్ట్రిక్ సైకిల్ అనేది చూడటానికి సైకిల్ లాగా కనిపించే ఓ ఎలక్ట్రిక్ బైక్.ఇక సింగిల్ చార్జ్ పై దీని రేంజ్ ఎక్కువగా 300 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. ఇక అంతేకాదు, దీని టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు 60 కిలోమీటర్ల వరకూ ఉంటుందని కంపెనీ పేర్కొనడం జరిగింది.ఇక ఈ ఎలక్ట్రిక్ సైకిల్ వచ్చేసి టోటల్ గా మూడు స్పీడ్ రేటింగ్‌లను కలిగి ఉంటుంది.
అలాగే దీని స్పీడ్ ను సైకిల్ ట్రాక్‌‌ల కోసం 25 km/h ఇంకా అలాగే సిటీ రోడ్ల కోసం 45 km/h ఇంకా మల్టీ లేన్ రోడ్స్ (హైవేల) కోసం 60 km/h గా రేట్ చేయబడింది. అయితే, ఈ సైకిల్ ను హైవేలపై అలాగే గంటకు 25 km/h కన్నా ఎక్కువ వేగంతో నడపాలంటే మాత్రం, డ్రైవింగ్ లైసెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి.ఇక bmw i Vision AMBY ఎలక్ట్రిక్ సైకిల్ జియోఫెన్సింగ్ తో పాటుగా ఇప్పుడు అనేక ఎలక్ట్రిక్ వాహనాలలో ఉన్న అన్ని ఫాన్సీ ఫీచర్లను ఇది కలిగి ఉంటుంది.అలాగే ఇది చాలా సింపుల్ డిజైన్ ను కలిగి ఉంటుంది. ఇది చూడటానికి డర్ట్ బైక్ లాగా కనిపించే ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ముందు భాగంలో పెద్ద టెలిస్కోపిక్ ఫోర్కులు ఇంకా అలాగే వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ అనేవి ఉంటాయి.ఇక ఈ సైకిల్ హ్యాండిల్‌బార్లు ఆన్-రోడ్ ఇంకా ఆఫ్-రోడ్ ట్రాక్‌లకు తగ్గట్లుగా ఏరోడైనమిక్ డిజైన్ కలిగి ఉండి, తగిన ఎత్తులో అమర్చబడి ఉంటాయి.అలాగే బైక్ ముందు భాగంలో 26 ఇంచ్ రిమ్ ఇంకా అలాగే వెనుకవైపు 24 ఇంచ్ రిమ్ అనేవి ఇందులో ఉంటాయి. ఇక వాటిపై అమర్చిన పెద్ద టైర్లు బెటర్ రోడ్ గ్రిప్ ని ఇంకా అలాగే సేఫ్టీనిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: