బుల్లిపిట్ట : ఇకపై యూట్యూబర్ల కు ట్యాక్స్ రూపంలో షాక్ ఇవ్వబోతోన్న యూట్యూబ్..! అసలు కారణం ఇదే..!
సాధారణంగా ప్రతి రంగాలలో ట్యాక్స్ కట్టడం ఒక నియమం. ఇప్పుడు సోషల్ మీడియాపై కూడా ట్యాక్స్ విధించబడుతుంది . అసలేంటి.. ఈ యూట్యూబ్ ట్యాక్స్.. అని ఆశ్చర్యపోతున్నారా..! నిజమేనండి.. యూట్యూబర్లకు, యూట్యూబ్ ట్యాక్స్ రూపంలో షాక్ ఇవ్వనుంది. దాని వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పూర్తి వివరాల్లోకి వెళితే, ఇంట్లోనే కూర్చొని యూట్యూబ్ ఛానల్ పెట్టి, ఎంతోకొంత సంపాదించే వాళ్ళు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువవుతున్నారు. అందులో భాగంగానే వారు క్రియేట్ చేసిన కంటెంట్ ను నెటిజన్లు చూడడం ద్వారా యూట్యూబర్లు డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ సంపాదనకు కోత పడనుంది. యూట్యూబ్ తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఎంతోమంది ఇండియన్ యూట్యూబర్లను నిరాశకు గురి చేస్తోంది..
అదేమిటంటే. మీ యూట్యూబ్ ఛానల్ కు అమెరికా వ్యూవర్ల ద్వారా వచ్చే ఆదాయం పై 15% వరకు టాక్స్ నిర్ణయించారు. అయితే ఈ ఏడాది నుంచి ఈ కొత్త ట్యాక్స్ ను అమలు చేయనున్నారు.. అంటే మీ ఛానెల్ కు ఒకవేళ అమెరికాలో ఉన్న వాళ్ళు ఫాలో అవుతుంటే, మీరు క్రియేట్ చేసిన కంటెంట్ వాళ్లు చూస్తుంటే, మీకు ఆదాయం వస్తుంది కదా..! ఇప్పుడు ఆ ఆదాయంపై 15 శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. ఈ పన్ను కేవలం అమెరికా బయటి యూట్యూబ్ వాళ్లకు మాత్రమే..
అయితే కొంతమంది యూట్యూబర్లు దీనిని జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే అమెరికా వ్యూవర్లు ఎక్కువగా ఉండే వారి ఆదాయంపై ప్రభావం పడనుందని ఒక యూట్యూబర్ చెప్పుకొచ్చాడు. అయితే మెజారిటీ ఇండియన్ యూట్యూబర్లు పెద్దగా అమెరికన్ ఆడియన్స్ కు సంబంధించిన కంటెంట్ క్రియేట్ చేయారని, అందువల్ల ఈ ట్యాక్స్ ప్రభావం అంతగా ఉండదని ఎన్ఏడి ఇన్ఫ్లూయెన్స్ గౌతం మాధవన్ అన్నారు..
కానీ మన భారత దేశంలో ఉన్న పెద్ద పెద్ద యూట్యూబర్లకు మాత్రం ఇది పెద్ద నష్టం అని చెప్పాలి. మన ఇండియాలో" టీ సీరీస్ " కే చాలా ఎక్కువ మంది సబ్ స్కైబర్లు ఉన్నారు. 17.6 కోట్లతో ఈ ఛానల్ టాప్ లో ఉంది. అయితే ఈ ఛానల్ వారికి 15 శాతం టాక్స్ అంటే, చాలా ఎక్కువ అన్నది మార్కెట్ నిపుణులు అంచనా.. ఏది ఏమైనా పెద్ద పెద్ద ఛానల్ వాళ్లకు ఇది పెద్ద నిరాశనే మిగిల్చిందని చెప్పవచ్చు.