భారతదేశంలో మొట్ట మొదటి ఏసీ రైల్వే స్టేషన్..! ఎక్కడో తెలుసా.?

Divya

ఇండియాలో రైల్వే స్టేషన్ లు చాలానే ఉన్నాయి. అవి ఎలా ఉంటాయో కూడా మనందరికీ తెలిసిందే. కొన్ని రైల్వేస్టేషన్లో అయితే సౌకర్యాలు ఉండవు. కానీ మన ఇండియాలోని కర్నాటకలోని బెంగళూరులో అచ్చంగా ఎయిర్పోర్ట్ లాంటి  రైల్వేస్టేషన్ ను నిర్మించింది రైల్వేశాఖ. ఇదిలా ఉండగా ఇది భారతదేశంలో తొలి ఏసీ రైల్వే స్టేషన్ కావడం విశేషం. దేశంలోని మొట్టమొదట సెంట్రలైజ్డ్ ఏ సీ రైల్వే స్టేషన్ కు సంబంధించిన ఫోటోలను రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయర్ రైల్వే శాఖ ట్విట్టర్ ద్వారా  పోస్ట్ చేశారు.

కర్ణాటక రాజధాని బెంగళూరులోని బయ్యాప్పణహళ్లి లో ఏసీ రైల్వే స్టేషన్  నిర్మించడం జరిగింది. మన భారత జాతి గర్వించే ఇంజనీర్, భారతరత్న బిరుదాంకితుడు అయిన 'మోక్షగుండం విశ్వేశ్వరయ్య ' దీనికి నామకరణం చేశాడు. రైల్వే స్టేషన్ ఫిబ్రవరి చివరినాటికి ప్రయాణికులకు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉందని తెలియజేస్తూ, ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
బెంగళూరు చాలా పెద్ద సిటీ. అందులో రైల్వేస్టేషన్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. కొత్తగా నిర్మించిన ఈ రైల్వేస్టేషనుకు రూ.314 కోట్లు ఖర్చు పెట్టారట. ఈ రైల్వే స్టేషన్ మొత్తం ఏ సీ తో నిండి ఉంటుంది. ఇక సదుపాయాల విషయానికి వస్తే,ఇక్కడ కూడా ఎయిర్పోర్టులో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది.
ఏసీ రైల్వే స్టేషన్లో ఎన్నో అధునాతన సౌకర్యాలతో నిర్మించారు. ఇది దేశంలోనే మొట్టమొదట సెంట్రలైజ్డ్  రైల్వే ఏసీ టెర్మినల్ గా పేరు పొందింది. రైల్వే స్టేషన్లో అప్పర్ క్లాస్ వెయిటింగ్ హాల్, వీఐపీ లాంజ్, రియల్ టైం ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టం, ఫుడ్ కోర్టు, నాలుగు లక్షల లీటర్ల సామర్ధ్యం గల వాటర్ రీసైక్లింగ్ ప్లాంట్ మొదలైనవి ఏర్పాటు చేశారు.
ఈ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ ను రూ.314 కోట్ల వ్యయంతో నిర్మించిన 4,200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. ఇక విమానాశ్రయాన్ని తలపించే ఈ టెర్మినల్ 250 కార్లు, 900 బైకులు, 50 ఆటోరిక్షాలు, ఐదు బస్సులను నిలిపే వీలుగా పార్కింగ్ ప్లేస్ ను ఏర్పాటు చేశారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: