షాక్: మరో వివాదంలో నయనతార.. నోటీసులు పంపించిన నిర్మాతలు..!

Divya
టాలీవుడ్, కోలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ గా పేరు పొందింది హీరోయిన్ నయనతార. గత కొద్దిరోజులుగా ఈమె పేరు ఎక్కువగా వార్తలలో నిలుస్తూ ఉంది. ముఖ్యంగా కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన ధనుష్ పై ఆమె కాపీ రైట్స్ ఆరోపణలను సైతం ఎదుర్కొన్నది. ఈ వివాదంలో కోర్టులో కేసు కూడా కొనసాగుతూ ఉన్నది. తమ సినిమాలో నుంచి ఫుటేజ్ ని అనుమతి లేకుండా నయనతార తన డాక్యుమెంటరీలో ఉపయోగించింది అంటూ ధనుష్ రూ .10 కోట్ల రూపాయల దావా కూడా వేశారు.

అయితే ఈ కేసు ప్రస్తుతం మద్రాస్ హైకోర్టులో విచారణ జరుగుతూ ఉండగా ఇప్పుడు తాజాగా నయనతారకు సంబంధించి మరొక సమస్య కూడా ఎదురైనది. అదేమిటంటే ఈ డాక్యుమెంటరీలో చంద్రముఖి సినిమాలోని కొన్ని సన్నివేశాలను అనుమతి లేకుండా ఉపయోగించినట్లు తెరమిదికి తీసుకురావడం జరిగిందని నిర్మాతలు ఈ విషయానికి సంబంధించి నెట్ ఫ్లిక్స్ కు లీగల్ నోటీసులను కూడా జారీ చేశారట. తమ కంటెంట్ ను చట్టవిరుద్ధంగా ఉపయోగించుకున్నందుకు రూ .5 కోట్ల రూపాయలు నష్టపరిహారం కట్టాలి అంటూ తెలియజేశారు.

దీంతో మరొకసారి నయనతార డాక్యుమెంటరీ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ధనుష్ చేసిన పనికి చంద్రముఖి సినిమా నిర్మాతలు కూడా తోడు కావడంతో డాక్యుమెంటరీ పైన కలిసి మరిన్ని కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మరి చంద్రముఖి సినిమా సన్నివేశాలు తీసుకున్నందుకు నయనతార ఎలా స్పందిస్తుంది ఈ విషయం పైన ఎలా రియాక్ట్ అవుతుందనే విషయంపై అభిమానులు చాలా ఆందోళనతో ఎదురు చూస్తున్నారు. గతంలో ధనుష్ పైన మాట్లాడుతూ ధనుష్ అనుమతి కోసం ఎంత ప్రయత్నించినా తాను టచ్ లోకి రాలేదని తన మేనేజర్ తో మాట్లాడామంటే తెలిపారు.. కానీ ధనుష్ తనమీద ఎందుకు అలా కోపం ఉన్నారో? ఎందుకు ద్వేషిస్తున్నాడో? అర్థం కాలేదంటో తెలియజేసింది నయనతార. మరి చంద్రముఖి నిర్మాతల పైన ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: