హీరో సూర్య సినిమాలోని సీన్ రిపీట్.. మహిళ ఏం చేసిందో తెలుసా?

praveen
ఈ విషయం వింటే మీరు అది నిజమే అంటారు. ఇపుడు చాలామంది సినిమాలను చూసే ఇలాంటి ఘోరాలు చేస్తున్నారేమో అనుకునేట్టు ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో వారు తమ మానప్రాణాలను కూడా లెక్కచేయడం లేదు అని చెప్పుకోవచ్చు. అవును, ఇది అచ్చం హీరో సూర్య సినిమాలోని సీన్ తలపించేలా ఉంది. 'వీడోక్కడే' సినిమా మీకు గుర్తుందా? అందులో హీరో సూర్య రకరాకాలుగా స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. అచ్చం అదే మాదిరి ఓ మహిళ 20 కోట్ల విలువైన కొకైన్‌ను దేశంలోకి అక్రమంగా తరలిస్తుండగా దొరుకుపోయింది.
అవును, దాదాపు 20 కోట్ల విలువైన కొకైన్‌ను దేశంలోకి తరలిస్తున్న ఇద్దరు బ్రెజిలియన్లను అరెస్టు చేసినట్లు కస్టమ్స్ విభాగం అధికారులు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తెలిపారు. నిందితులు బ్రెజిల్‌కు చెందిన మహిళ, పురుషుడు ఉండడం గమనార్హం. ఇద్దరు ప్రయాణికులు తాము కొన్ని మత్తు పదార్థాలతో కూడిన క్యాప్సూల్స్ తీసుకున్నట్లు కూడా అంగీకరించారు. ఆ మొత్తం కొకైన్ తమ పొట్టలో పెట్టుకుని తరలించినట్లు అధికారులు గుర్తించారు. ఆపై ఆస్పత్రికి తరలించి శస్త్ర చికిత్స చేసి పురుషుడి కడుపులోనుంచి 937గ్రా.బరువున్న 105, మహిళ నుంచి 562గ్రా. 58 క్యాప్సుల్స్ బయటకు తీశారు. కాగా వీటి విలువ రూ.20 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.
ఏదిఏమైనా డ్రగ్స్ సరఫరా చేసేందుకు నేరస్తులు కొత్త దారులను ఎంచుకోవడం చూస్తే సినిమాలను తలపిస్తోంది అనడంలో అతిశయోక్తి లేదు. ఆమధ్య కూడా ఓ మహిళ ఏకంగా తన ప్రైవేట్ పార్ట్స్ లో దాచి హెరాయిన్ సరఫరా చేయాలని యత్నించగా దొరికిపోయింది. దాదాపు రూ.6కోట్లు విలువచేసే హెరాయిన్ సరఫరా చేసేందుకు ఆమె యత్నించి అధికారులకు చిక్కింది. జైపూర్‌లోని డిఆర్‌ఐ (డైరెక్టరేట్ రెవెన్యూ సర్వీసెస్)  అధికారులు సదరు డ్రగ్స్ సరఫరా చేస్తున్న మహిళను అరెస్టు చేయడం గమనార్హం. కాగా ఆమె సూడాన్ దేశానికి చెందిన మహిళ అని తెలుస్తోంది. ఆమె ఈ మందులను ప్రైవేట్ పార్ట్, పొట్టలో దాచిపెట్టడం కొసమెరుపు. అయితే దాన్ని బయటకు తీయడానికి అధికారులకు దాదాపు 11 రోజులు పట్టిందని సమాచారం. అయితే ఇలాంటివి చేయడం నేరమే కాక... ఆయా మందులు పగిలి శరీరం లోపలి ప్రవేశించినట్లైతే, మొత్తానికి ప్రాణాలే గాల్లో కలిసిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: