డాకు మహారాజ్ : బాలయ్య ముందు భారీ టార్గెట్.. ఎన్ని కోట్లు రాబట్టాలంటే...?

Divya
నందమూరి బాలయ్య డైరెక్టర్ బాబి దర్శకత్వంలో వస్తున్న చిత్రం డాకు మహారాజ్.. ఈ చిత్రం ఈనెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇటీవలే ట్రైలర్ కూడా విడుదల అవ్వగా అభిమానులను బాగా ఆకట్టుకుంది.భారీ బడ్జెట్ తో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన ఈ సినిమాని నిర్మిస్తూ ఉన్నారు. రూ .100 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా నిర్మాణం జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో చిత్ర బృందం బాగా యాక్టివ్గానే ఉన్నది.. మరి సంక్రాంతి బరిలో దిగబోతున్న డాకు మహారాజ్ సినిమా సక్సెస్ అవ్వాలి అంటే ఎన్ని కోట్లు రాబట్టాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

బాలయ్య సినిమాలు అంటే చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ సైతం ఏగబడి కొంటున్నారు. గత కొంతకాలంగా బాలయ్య సినిమాలు మంచి విజయాలను అందుకుంటున్నాయి. డాకు మహారాజ్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా నైజాం రైట్స్ ని దిల్ రాజు సొంతం చేసుకున్నారు. మిగిలిన ప్రాంతాలలో కూడా ఈ సినిమా భారీగానే అమ్ముడుపోయినట్లు సమాచారం.ఈ సినిమా మొత్తానికి రూ .83 కోట్లు రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. అంటే బాక్సాఫీస్ వద్ద రూ.84 కోట్ల రూపాయల షేర్ ను రాబట్టాల్సి ఉన్నది.

బాలయ్య కెరియర్ లోనే అత్యధికంగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన సినిమాగా డాకు మహారాజ్ ఉన్నది. ఈ సినిమాతో బాలయ్య రూ.100 కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉన్నదంటూ అభిమానులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికే అఖండ, భగవంత్ కేసరి, వీర సింహారెడ్డి చిత్రాలతో రూ .100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని దాటుకున్నారు. డాకు మహారాజ్ సినిమా సక్సెస్ అయ్యిందంటే అఖండ-2 సినిమా భారీ స్థాయిలో తెరకెక్కించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. బిజినెస్ కూడా ఇదే స్థాయిలో జరుగుతుందని చెప్పవచ్చు. డాకు మహారాజ్ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ ,శ్రద్ధ శ్రీనాథ్ నటించగా ,బాబి డియోల్ విలన్ గా నటిస్తున్నారు .మరి టికెట్ల రేటు కూడా పెరగడంతో బాలయ్య సినిమాకి ఏ విధంగా కలిసి వచ్చి టార్గెట్ త్వరగా ఫినిష్ చేస్తారో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: